పశ్చిమ బెంగాల్ లో ప్రచారం నిలిపివేత: ఈసీ అనూహ్య నిర్ణయం

By telugu teamFirst Published May 16, 2019, 12:58 AM IST
Highlights

గురువారం రాత్రి నుంచి ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజవవర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుంది. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో శుక్రవారం 5 గంటలకు ప్రచార ఘట్టం ముగియాల్సి ఉంది. 

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బెంగాల్‌లోని తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిలిపేసింది.  ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రచారాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇందుకు గాను ఈసి ఆర్టికల్ 324ను ప్రయోగించింది. ఈసీ ఈ ఆర్టికల్ ను అమలు చేయడం ఇదే తొలిసారి.
 
గురువారం రాత్రి నుంచి ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజవవర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుంది. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో శుక్రవారం 5 గంటలకు ప్రచార ఘట్టం ముగియాల్సి ఉంది. 

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షో సందర్భంగా పెద్ద యెత్తున హింస చెలరేగిన నేపథ్యంలో ఈసీ ఆ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందు వల్ల హోం సెక్రటరీ పదవి నుంచి ఐఏఎస్ అధికారి అత్రి భట్టాచార్యను తొలిగిసున్నట్లు కూడా ఈసీ ప్రకటించింది. ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్‌ను హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది.

ఎన్నికల కమిషన్ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, వివక్షాపూరితమైందని ఆమె అభివర్ణించారు. 

గురువారంనాడు మోడీ సభలు రెండు పశ్చిమ బెంగాల్ ఉన్నాయని, ఆయన సభలు ముగియగానే ప్రచారం ముగుస్తుందని ఆమె అన్నారు. అమిత్ షాను శిక్షించాల్సింది పోయి ఈసిీ బిజెపికి గిఫ్ట్ ఇస్తోందని ఆమె అన్నారు. 

click me!