మాయావతికి షాక్: కాంగ్రెసులోకి ఇద్దరు బిఎస్పీ నేతలు

By telugu teamFirst Published Mar 5, 2019, 11:17 AM IST
Highlights

కైసర్ జహాన్, అన్సారీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్లు కాంగ్రెసు అధికార ప్రతినిధి బ్రిజెందర్ కుమార్ సింగ్ చెప్పారు.

లక్నో: ఎన్నికల వేళ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత మాయావతికి ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు నేతలు షాక్ ఇచ్చారు. మాజీ ఎంపి కైసర్ జహాన్, మాజీ ఎమ్మెల్యే జస్మీర్ అన్సారీ సోమవారంనాడు కాంగ్రెసు పార్టీలో చేరారు. యుపిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్ సమక్షంలో అనుచరులతో కలిసి వారిద్దరు కాంగ్రెసులో చేరారు. 

కైసర్ జహాన్, అన్సారీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్లు కాంగ్రెసు అధికార ప్రతినిధి బ్రిజెందర్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా రాజ్ బబ్బర్ మాట్లాడుతూ.. కేంద్రం తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే యువత, రైతాంగం, కార్మిక వర్గం, వ్యాపార వర్గాల హక్కులను పరిరక్షిస్తుందని అన్నారు. జహాన్, అన్సారీ అంతకు ముందు ఉత్తరప్రదేశ్ తూర్పు ఐఎసిసి ఇంచార్జీ ప్రియాంక గాంధీని కలిశారు. ఆ తర్వాత బిఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. 

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అఫ్తాబ్ అహ్మద్ ఖాన్, ఛేంబర్ ఆఫ్ కామర్స్ వైఎస్ చైర్మన్ సురేంద్ర కుమార్ కూడా తమ పార్టీలో చేరినట్లు బ్రిజేందర్ కుమార్ సింగ్ చెప్పారు. 

click me!