ఆమేథీ: రాహుల్ నామినేషన్‌‌‌కు ఆమోదం

By narsimha lodeFirst Published Apr 22, 2019, 1:18 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ ఎంపీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ నామినేషన్ సక్రమంగా ఉందని  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు

ఆమేధీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ ఎంపీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ నామినేషన్ సక్రమంగా ఉందని  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమేథీ ఎంపీ స్థానం నుండి  ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇదే స్థానం నుండి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానంతో పాటు  కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానం నుండి కూడ రాహుల్ పోటీ చేస్తున్నారు.

అయితే నామినేషన్ల పరిశీలన సమయంలో  ఈ స్థానం నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్ధి రాహుల్ నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. యూకే పౌరసత్వాన్ని రాహుల్ కలిగి ఉన్నారని చెప్పారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నందున రాహుల్ నామినేషన్‌ను తిరస్కరించాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.

రాహుల్ గాందీ నామినేషన్ ప్రక్రియ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం నాడు స్పష్టత ఇచ్చారు. రాహుల్‌ ప్రత్యర్థులుగా ఉన్న స్వతంత్ర అభ్యర్థితో పాటు మరో నలుగురు అభ్యర్థులు కూడ ఇదే విషయాన్ని సమర్ధించారు. అయితే రాహుల్ గాంధీ తన పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను  సమర్పించారు. 

దీంతో రాహుల్ గాంధీ నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. రాహుల్ గాంధీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడ ఇచ్చినట్టుగా  రాహుల్ గాంధీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు.

ఓ కంపెనీలో  రాహుల్ గాంధీ యూకే పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని  ఆమేథీ నుండి  ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ధృవ్ లాల్ అనే అభ్యర్థి ఫిర్యాదు చేశారు.

click me!