
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం అర్థరాత్రి దాటాకా కేరళ, మహారాష్ట్రలలోని కొన్ని స్ధానాలకు ఏఐసీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాతో కాంగ్రెస్ మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.
కేరళ:
అలప్పుజా-శనిమోల్ ఉస్మాన్
అట్టింగల్- అదూర్ ప్రకాశ్
మహారాష్ట్ర:
నందూర్‌బర్- కేసీ పడావి
ధూలే- కునాల్ రోహిదాస్
వార్థా- చారులత ఖాజాసింగ్
యవత్మాల్, వాశిమ్- మానిక్‌రావు జీ ఠాక్రే
ముంబయి సౌత్ సెంట్రల్- ఏక్‌నాథ్ గైక్వాడ్
షిరీడి- బావుసాహెబ్ కాంబ్లే
రత్నగిరి, సింధు దుర్గ్- నవీన్ చంద్ర బండివడేకర్