అనంతపురం సీటు: జేసీ కోట తనయుడిని ఆదరిస్తోందా

By narsimha lodeFirst Published Feb 28, 2019, 11:16 AM IST
Highlights

 అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు దఫాలు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానం నుండి గెలుపొందారు. 


అనంతపురం: అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు దఫాలు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానం నుండి గెలుపొందారు. 

1957లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈ స్థానం నుండి ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు తరిమెల్ల నాగిరెడ్డి విజయం సాధించారు.ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి జేసీ సోదరులు టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లాలో రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబునాయుడు జేసీ దివాకర్ రెడ్డిని టీడీపీలో  చేర్చుకొన్నారు.

2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుండి పోటీ చేసి గెలుపొందాడు. రాయదుర్గం టిక్కెట్టును కూడ జేసీ అల్లుడు కోరుకొన్నాడు. కానీ, ఆ స్థానంలో కాలువ శ్రీనివాసులును టీడీపీ బరిలోకి దింపింది. కాలువ శ్రీనివాసులు కూడ ఈ స్థానం నుండి విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న స్థానం అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు కూడ దక్కలేదు.

1952 లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైడి లక్ష్మయ్య విజయం సాధించారు. 1957లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధిగా బరిలో దిగిన తరిమెల్ల నాగిరెడ్డి గెలుపొందారు. 1962లోకాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ అలీ ఖాన్,1967,1971 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థి పొన్నపాటి అంటోని రెడ్డి విజయం సాధించారు.

1977,1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డి.పుల్లయ్య విజయం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్థి దేవినేని నారాయణస్వామి  విజయం సాధించారు. 1989, 1991లోఅనంత వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.

1991,1996 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి విజయం సాధించారు.1999లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు. 2004, 2009లలో కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి జేసీ దివాకర్ రెడ్డి గెలుపొందారు.ఈ దఫా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.

 

click me!