కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

By telugu teamFirst Published Sep 23, 2019, 11:05 AM IST
Highlights

సవాలక్ష ప్రకటనల్లో నీ అందచందాలు ఆరబోసిన మృగాళ్ల వాణిజ్యకుతిపై కరవాలమెత్తి.. మానసిక రోగులైన మనువాదుల అజ్ఞానాన్ని వాడవాడకు చాటింపు     వేయాలి! అని అంటున్నాడు కవి కోడం కుమారస్వామి. 

‌1. ఎప్పటికీ నువ్వు ప్రశ్నించలేవా 
‌ఎన్నటికీ బద్మాష్ గాణ్ని నిలదీయలేవా ?
వాడి అహాన్ని అణచలేని అబలను అనుకుంటున్నావు కదా! 
‌ఒక్కసారి సమ్మక్కలా నిలబడి చూడు!!

‌2.నోటికి సంప్రదాయ సంకేళ్లు వేసుకొని
‌ఒంట్లో పిరికి మురికి ప్రవహిస్తున్నదానవు 
‌జీవితాన్ని వంటింటికీ, పడగ్గది ఉద్యోగానికి పర్మనెంట్ చేసే మనువాడిన మనువును  ప్రశ్నిస్తే పుక్కిటి పురాణ కర్రలతో అణచివేస్తే పాంచాది నిర్మలవై పటపటా పళ్లు కొరుకేయ్...
‌         
‌3. మాయలోడు మనువు వల్లే ఇంకా శవంగా ఇంటాబయట బతుకుతున్నావు
‌లక్షణంగా ఉన్నాడని లక్షలు పోసి కొనుక్కొంటే 
‌పశువులా కుమ్ముతుంటే ఎదురు తిరిగి వాడి అహం కొమ్ములు కత్తరించి
‌అంబేద్కర్ లా మనుస్మృతుల్ని మరోసారి తగలబెట్టూ...

‌4.సవాలక్ష ప్రకటనల్లో నీ అందచందాలు ఆరబోసిన మృగాళ్ల వాణిజ్యకుతిపై కరవాలమెత్తి 
‌మానసిక రోగులైన మనువాదుల అజ్ఞానాన్ని వాడవాడకు చాటింపు     వేయాలి!                    

‌5.దున్నపోతు ఊరంతా తిరిగి మురుగు కాలువల్లో బోర్లాడినా మూడుముళ్ల బందెలదొడ్డిలో శ్రావణపతిభక్తి కంటే 
‌మొరిగే చిత్తకార్తే కుక్కలు, గోముఖ   వ్యాఘ్రాల్ని కబేళాకు తరలించేసేయ్...

‌6.నానా రంకు వెధవలు
‌బొంకుగాళ్లు మారువేశాల మనువు గాడు గుడి
లో బడిలో  కార్ఖానాలో 
ఎక్కడైనా ఎదురురైతే సారక్కవై పోరు చేయాల్సిందే!
‌నిరంతర సమరం సాగించాల్సిందే!!

‌----కోడం కుమారస్వామి

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్ని కవితలు

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!