డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

By telugu team  |  First Published Sep 22, 2019, 10:32 AM IST

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి స్వచ్ఛ నేస్తం పేర కవిత రాశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం ఎలా సమకూరుతుందో ఆమె కవితాత్మకంగా చెప్పారు.


ఆరోగ్య దాయిని
ఆనంద ప్రదాయిని
స్వచ్ఛతకు మారుపేరు
శుభ్రతలో దరి చేరు

అరుణ కిరణాలు పుడమి మీద పడక మునుపే ధరణి చెంత చేరు
అతివల హస్త భూషణం
చెత్త చెదారమే కాదు
వెధవల బుద్ధిలోని బూజును దులిపే మంత్రదండం
దుర్మార్గాన్ని అణచ ఉపయగించే వజ్రాయుధం!!

Latest Videos

చేసేదంతా చేసి ఏమి తెలియనట్లు మూలకు 
కూచునే నంగనాచి
మౌనంగా ఒక మూల తపస్సు చేసే ముని!!

గుడిసె గూడు
భవనం వనం
అంతా నీదే
పేద గొప్ప లేదు
కులమతాలు లేవు
ప్రాంతీయ భేదం అసలు లేదు
అంతటా నువ్వే!!

దోసె రుచి కొరకు
పెనం శుభ్రం చేసే
పుల్లల వస్తువు చీపురు!!

రాజకీయాల్లో ప్రముఖ పాత్ర 
పోషించి   ఢిల్లీ సింహాసనం 
ఎక్కించిన మాయలాడి!!

పరిశుభ్రతకు పరిపరి విధాల
అన్నివేళలా అందరికి 
ఉపయోగపడే సహాయకారి
ఎన్నో హంగులతో 
రూపు దిద్దుకునే వగలాడి
అందమైన వస్తువు
చీపురు కాదు చీదరింపు వద్దు
 శ్రీ మహా లక్ష్మీ!!

- డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్ని కవితలు

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

click me!