తెలుగు సాహిత్యం: వినాయకం ప్రకాశ్ ధనాసి ఉషారాణి కవితా సంపుటి సిరి రేఖలుపై సమీక్ష చేశారు. "సిరి రేఖలు" కవితా సంపుటిలో.. విసుగు పుట్టించే వర్ణనలు అస్సలు లేవు,క్లిష్టమైన పదబంధాల జాడ లేదు,వ్యక్తి పూజ కు దూరంగా ఉంది.
సరళమైన పదాలతో అద్భుతమైన అర్థం ఆవిష్కరింప చేసేది ఉత్తమమైన కవిత్వం, మన రచనలు సమాజ వికాసానికి మరియు మనుషుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, బతుకు చిత్రాన్ని చూచిన కవి అక్షరానికి ఒక స్పష్టమైన గమ్యం ఉంటుంది ఆఅక్షరం అసమానతలపై ఉక్కుపాదం మోపి సమాజంలో ఒక వెలుగు రేఖల్ని ప్రసరింప చేయాలి అప్పుడే కవికి గుర్తింపు అలా సమాజానికి ఉపయోగపడే ఒక కవితలు పుస్తకరూపంలోకి వస్తే అది *డాక్టర్ ధనాసి ఉషారాణి* గారి *సిరి రేఖలు* గా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
"సిరి రేఖలు" కవితా సంపుటిలో.. విసుగు పుట్టించే వర్ణనలు అస్సలు లేవు,క్లిష్టమైన పదబంధాల జాడ లేదు,వ్యక్తి పూజ కు దూరంగా ఉంది.
ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్ష్యం సమాజ చైతన్యం మరియు సామాజిక సమస్యలపై పోరాటం.. సామాజిక సమస్యలు కవితల అంశాలుగా తీసుకుని కవితలు మొగ్గలు ప్రక్రియ లో రాయడం ఆదర్శంగా ఉంది.
undefined
Also Read:ఏడవ రుతువు-వైష్ణవిశ్రీ కవిత్వం
డా.ధనాసి ఉషారాణి గారు ఉపాధ్యాయురాలిగా వృత్తిని కొనసాగిస్తూ తన విద్యార్థులందరినీ ఆదర్శ దేశ పౌరులుగా తీర్చి దిద్దుతూ, ప్రవృత్తిగా కవితలు రాయడం కథలు రాయడం ఎంచుకుని తద్వారా తెలుగుతల్లి సేవలో తరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవార్డులు బిరుదులు సొంతం చేసుకొని సాహిత్య సేవలో తరిస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
*సిరి రేఖలు* కవితా సంపుటి విషయానికొస్తే.. ఇందులోని డెబ్భై కవితలు కూడా చాలా సరళంగా పాఠకుల హృదయానికి చేరువ గా ఉన్నాయి.
కవితల్లోని కవితా వస్తువు ,శైలి, శిల్పం ,ఎత్తుగడ ముగింపు, పదబంధాల అమరిక, అర్థం, కవితా నిర్మాణ నైపుణ్యం , సామాజిక స్పృహ మొదలైన అంశాలు చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి.ఇవన్నీ రచయిత్రి యొక్క ప్రతిభను చెప్పకనే చెబుతున్నాయి.
Also Read: కన్నీరొలికించిన అభ్యుదయ కవి కలం
కవితల శీర్షికలు కూడా చాలా సరళంగా ను విభిన్నంగానూ ఆదర్శవంతంగా ఉన్నాయి ఉదాహరణకు...రైతన్న, ఆడపిల్ల, పచ్చ నోటు, మనిషి తీరు ,అనుమానం, కవి మొగ్గలు,ఎక్కడ మానవత్వం.. మొదలైనవి ఎన్నో కవితా శీర్షికలు మనకు సుపరిచితం
*నాయకుడు* అనే కవితలో ఉత్తమమైన నాయకుడు ఎలా ఉండాలో వివరించారు, "నాయకునికి క్రమశిక్షణ,అసమానతలపై స్వారీ చేసే సామర్థ్యం సమైక్య భావాలు మెండుగా ఉండాలని" కవయిత్రి ఆశాభావం వ్యక్తం చేశారు
*గురువు* అనే కవితలో "సమస్త జగతిని బోధనలో ఆవిష్కరించే ఆత్మీయ వెలుగు గురువు "అంటారు కవయిత్రి
కవితల్లో సామాజిక స్పృహ బాధ్యత ఉన్నాయి.
మహిళలపై ఆడపిల్లలపై వారి వారి సమస్యల పై కవితలు రాసిన తీరు చాలా ఆదర్శవంతంగా ను స్పూర్తివంతంగా ను ఉంది
*కవి మొగ్గలు* అనే కవితలో "కవి సమాజంలో కుళ్ళుని వేటాడి అంతం చేసే విధంగా ఉండాలని, ప్రతి అనుభూతిని అమ్మ ప్రేమతో చూడాలని పుడమిని తన అద్భుత శక్తి తో పులకింపచేసే సామర్థ్యం కవి కలిగి ఉండాలని" అంటారు కవయిత్రి.
Also Read: కవి యాకూబ్ తీగల చింత: లుప్త విలువల చింతన
అనుమానం ఏవిధంగా వినాశనానికి దారి తీస్తుందో *అనుమానం* అనే కవితలో వివరించారు.
రైతన్న యొక్క వెతలను కళ్లకు కట్టినట్లు వివరించే కవిత *రైతన్న* "తన రూధిరాన్ని ..స్వేదాన్ని ఏరులై పారించి పొలంలో బంగారు పంటలు పండిస్తారు" అని రైతు గొప్పతనం కవిత రూపంలో వివరించారు.
*కార్మికుడు* అనే కవితలో కార్మికునికి కార్మికుని యొక్క జీవన శైలిని వివరిస్తూ "తాను పొట్టకూటికోసం సిమెంటును అత్తరులా జల్లుకుంటాడు" అంటూవారి యొక్క కష్టాలను కవిత రూపంలో చక్కగా వర్ణించిన తీరు ఆదర్శవంతంగా ఉంది
ఉషా రాణి గారి కవితలన్నీ చాలా బాగున్నాయి ప్రతి కవిత దేనికవే సాటి ప్రతీ కవితలోనూ సమాజహితం బాధ్యత సమాజానికి ఏదో చేయాలి అనే తపన, మార్పు కోరుకునే తత్వం , సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే తీరు చాలా బాగుంది ఇంత మంచి కవితలు రాసిన కవిత ఉషారాణి గారికి అభినందనలు
మానవీయ విలువలు శిథిలం అవుతున్న నేటి సమాజంలో తన వంతు ప్రయత్నంగా *సిరి రేఖలు* అనే కవితా సంపుటి ద్వారా సమాజానికి అక్షరాలప్రాణం పోశారు కవయిత్రి.
ఇంత మంచి పుస్తకం రాసిన కవయిత్రి ఉషారాణి గారికి అభినందనలు తెలుపుతూ ఈ పుస్తకం సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఉషారాణి గారు ఇంకెన్నో మంచి పుస్తకాలు వెలువరించాలి అని కోరుతూ మరొక్కమారు కవయిత్రి గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు.
- వినాయకం ప్రకాష్