వరల్డ్ లయన్ డే.. సింహం సింగిల్ గా కాదు.. గుంపుగానే వస్తుందట!

By telugu news teamFirst Published Aug 10, 2020, 12:22 PM IST
Highlights

నిజానికి సింహం సింగిల్ గా ఉండదట. ఎప్పుడైనా గుంపులుగానే ఉంటుుందట.  దాదాపు పది, పదిహేను సింహాలు గుంపులుగా ఉంటాయట. 
 


సింహం.. అడవికి రాజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కాగా.. ఈ రోజు ప్రపంచ లయన్స్ దినోత్సవం. మరి ఈ సందర్భంగా.. లయన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందామా..

రజినీ కాంత్ సినిమాలో అనుకుంట.. నానా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ ఉంటుంది. అయితే.. నిజానికి సింహం సింగిల్ గా ఉండదట. ఎప్పుడైనా గుంపులుగానే ఉంటుుందట.  దాదాపు పది, పదిహేను సింహాలు గుంపులుగా ఉంటాయట. 

ఒక పెద్ద మగ సింహం గర్జిస్తే దాదాపు 8 కిలోమీటర్ల దూరం వినపడుతుందట.

అంతేకాదు.. ఒక మగ సింహం ప్రతి రోజూ 5కేజీల మాంసం తినగలదట. అదే మగ సింహం అయితే.. దాదాపు 7కేజీల మాంసం తింటుందట.  సింహం బిడ్డని కబ్ అని పిలుస్తారు. ఒక సింహానికి 25 సంవత్సరాలు జీవించగల సత్తా ఉంటుందట. అయితే.. యావరేజ్ గా ప్రతి సింహం 12 నుంచి 16 సంవత్సరాలు జీవిస్తుంది. 

click me!