ఆ విషయంలో పల్లెటూరు అమ్మాయిలే ఫాస్ట్ గా ఉన్నారు

By ramya neerukondaFirst Published Dec 25, 2018, 3:55 PM IST
Highlights

పెళ్లై నెలలు గడుస్తున్నా, లైంగిక క్రీడలో పాల్గొనే తీరు తెలియక, పిల్లలు పుట్టట్లేదని వైద్యులను కలిసే సాఫ్ట్‌వేర్‌ దంపతులు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నారట. తొలి రాత్రి ఏం చేయాలో తెలియక చాలా మంది తికమక పడతారని నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా విషయంలో అవగాహన లేదంటే చాలు.. వాళ్లని పల్లెటూరు మొద్దు అంటూ కామెంట్ చేయడం చాలా మంది వినే ఉంటారు. పల్లెటూరిలో పెరిగిన వారికి, చదువుకోని వారికి ఏ విషయాలు తెలియవని.. అన్ని విషయాల్లో అవగాహన ఉండదనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. అయితే.. సెక్సువల్ లైఫ్ విషయంలో మాత్రం పట్టణ వాసులకన్నా.. గ్రామీణులకే ఫాస్ట్ గా ఉన్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది. 

లైంగికపరమైన విషయాల్లో, అవగాహనపరంగా గ్రామీణులే మెరుగ్గా ఉంటున్నారు. వారితో పోల్చుకుంటే పట్నాల్లో ఉండే చదువుకున్న వాళ్లు ఈ విషయాల్లో వెనకబడి ఉన్నారని సర్వేలో తేలింది. చిన్నప్పటి నుంచి చదువు, ఇల్లే ప్రపంచంగా పెరిగిన పిల్లలు పెరిగి పెద్దయి ఉన్నతమైన వృత్తుల్లో స్థిరపడగలుగుతారు. కానీ వారికి ఉండవలసినంత లైంగిక జ్ఞానం ఉండటంలేదట.

 పెళ్లై నెలలు గడుస్తున్నా, లైంగిక క్రీడలో పాల్గొనే తీరు తెలియక, పిల్లలు పుట్టట్లేదని వైద్యులను కలిసే సాఫ్ట్‌వేర్‌ దంపతులు ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్నారట. తొలి రాత్రి ఏం చేయాలో తెలియక చాలా మంది తికమక పడతారని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఏమి చేయాలో అవగాహన లేక.. పెద్దలను అడగాలంటే మొహమాటపడుతున్నారట. 
 
ఇంకొందరేమో.. స్వయంతృప్తికి బానిసలుగా మారిపోయి.. నిజ జీవితంలో సెక్స్ కి దూరమౌతున్నారని తెలుస్తోంది. ఇంకొందరు పోర్న్ వీడియోలు చూస్తూ.. అలా చేయలేకపోతున్నామనే భావనలో బ్రతికేస్తున్నారని సర్వేలో తేలింది. నూటికి 30శాతం మంది పట్టణవాసులు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. 

click me!