పాలు, పంచదారతో తయారుచేసిన టీ కంటే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తాగితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే మీరు రాత్రిపడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో తెలుసా?
గ్రీన్ టీ ఒక హెల్తీ డ్రింక్. టీ, కాఫీ లకంటే ఈ గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ దీన్ని తాగితే మీరు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీలో కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి 2,విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
బాగా నిద్రపడుతుంది: గ్రీన్ టీలో అమైనో ఆమ్లం ఎల్-థియనిన్ ఉంటుంది. ఇది మీరు మంచి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ-యాంగ్జైటీ లక్షణాలు కూడా ఉంటాయి. దీన్ని రాత్రిపడుకునే ముందు తాగితే మీరు కంటినిండా నిద్రపోగలుగుతారు. ఇది సహజంగా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
undefined
గుండె ఆరోగ్యం మెరుగ్గా: గ్రీన్ టీ ని తాగితే మన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కూడా తగ్గుతుంది. అలాగే గ్రీన్ టీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది కూడా.
ఒత్తిడి నుంచి ఉపశమనం: గ్రీన్ టీ మిశ్రమంలో ఉండే కెఫిన్ మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది మీకు మంచి విశ్రాంతి భావనను కూడా ఇస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఎల్-థియనిన్ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
బరువు : బరువు తగ్గాలనుకునే వారికి కూడా గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది. మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే కేలరీలు కరిగిపోతాయి. ఫాస్ట్ గా బరువు తగ్గడానికి మీరు రాత్రిపూట గ్రీన్ టీ తాగొచ్చు. ఇది కొవ్వును ఫాస్ట్ గా కరిగిస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి బాగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుంది.
జలుబు, జలుబు నుంచి ఉపశమనం: మీకు దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే రాత్రిపడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగండి. ఇది మీ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పడుకునే ముందు 1 కప్పు గ్రీన్ టీ తాగితే మెటబాలిజం పెరుగుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.