జుట్టుకు హెన్నా పెడితే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 2, 2024, 3:32 PM IST

తెల్ల జుట్టు నల్లగా కావాలని, జుట్టు స్ట్రాంగ్ గా ఉండాలని చాలా మంది జుట్టుకు హెన్నాను తరచుగా పెడుతుంటారు. హెన్నా వల్ల ప్రయోజనాలే తప్పా.. ఎలాంటి నష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ హెన్నా కూడా ఎన్నో సమస్యలను కలిగిస్తుంది తెలుసా? 
 


చాలా మంది జుట్టును అందంగా ఉంచడానికి రకరకాల షాంపూలను ఉపయోగిస్తున్నారు. కానీ దీనివల్ల పిల్లలతో పాటుగా పెద్దల జుట్టు కూడా గ్రే అవుతోంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది రసాయనాలు ఎక్కువగా ఉండే హెయిర్ కలర్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ వీటివల్ల వెంట్రుకలు చాలా ఫాస్ట్ గా నల్లగా మారినా ఆ తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అందుకే ఇలాంటి సమస్యలేమీ రాకుండా ఉండటానికి ఇండిగో పౌడర్, గోరింటాకును కలిపి జుట్టును నేచురల్ గా మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలా మంది అనుకుంటారు. అందుకే వీటిని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని .ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం మీరు కొన్ని సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. 

Latest Videos

undefined

జుట్టుకు గోరింటాకును పెట్టడం వల్ల వచ్చే సమస్యలు.. 

నిజానికి వారానికి ఒకసారి జుట్టుకు గోరింటాకును పెట్టేవారున్నారు. కానీ ఇలా అస్సలు పెట్టకూడదు. గోరింటాకును జుట్టుకు నెలకోసారి మాత్రమే పెట్టాలి. అప్పుడే మీ జుట్టుకు సహజసిద్ధమైన రంగు వస్తుంది. 

గోరింటాకు, ఇండిగో వాడితే కొన్ని నెలల పాటు వెంట్రుకలు నల్లగా ఉంటాయి. రోజులు గడిచేకొద్దీ గోరింటాకు రంగు తగ్గుతుంది. దీనివల్ల మీ వెంట్రుకలు నారింజ, ఎరుపు, గోధుమ రంగులోకి మారుతాయి. దీనివల్ల మీ సాధారణ జుట్టు అందం పాడవుతుంది. దీనివల్ల మీ వెంట్రుకలే భిన్నంగా కనిపిస్తాయి. 

గోరింటాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టులోని సహజ ఆయిల్ ను తొలగిస్తాయి. దీనివల్ల నెత్తిమీద చుండ్రు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది జుట్టు పొడిబారేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు విపరీతంగా రాలడం మొదలవుతుంది. 

జుట్టు నల్లగా మారాలంటే గోరింటాకును తలకు పట్టించి గంట వరకు అలాగే వదిలేయాలి. ఇది ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గోరింటాకు వెంట్రుకల నుంచి వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇది తలకు అంటుకుంటుంది. దీన్ని ఉపయోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీ జుట్టు పెరగడం ఆగిపోయి బాగా రాలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మనలో ప్రతిఒక్కరికీ తెల్ల వెంట్రుకలు అక్కడక్కడ ఉంటాయి. ఈ వెంట్రుకలు కనిపించకుండా ఉండేందుకు గోరింటాకును ఉపయోగిస్తుంటారు. దీనివల్ల తెల్లవెంట్రుకలు బూడిద రంగులోకి వస్తే.. నల్ల వెంట్రుకల్లో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా నల్ల వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఏదేమైనా జుట్టుకు గోరింటాకును ఉపయోగించే ముందు మీ చేతులకు లేదా కొంచెం జుట్టుకు గోరింటాకును అప్లై చేసి అది మీకు పడుతుందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. మీ జుట్టు నల్లగా, బలంగా ఉండాలంటే మీరు పౌష్టికాహారాన్ని తినాలి. మంచి మంచి కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోవాలి. దీనివల్ల తెల్లజుట్టు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 
 

click me!