చలికాలంలో నెయ్యి.. చేస్తుంది మ్యాజిక్

By ramya neerukondaFirst Published Nov 16, 2018, 4:47 PM IST
Highlights

రోజూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటే.. మలబద్దకం సమస్య తగ్గిపోయి.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

చలికాలం మొదలైంది అంటే చాలు.. సీజన్ వ్యాధులు క్యూ కట్టేస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉండి ఉంటారు. అసలు.. ఈ సీజన్ వ్యాధులు మనదరిచేరకుండా ఉండాలంటే ఒకటే మార్గం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే నెయ్యి. మీరు చదివింది నిజమే. కేవలం ఈ ఆరోగ్య సమస్యలే  కాకుండా నెయ్యి తింటే.. ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. మరి అవేంటో మనమూ ఒకసారి లుక్కేద్దామా... 

1. నెయ్యి తింటే  చాలా మంది ఒంట్లో కొవ్వు పెరిగిపోతుందని భావిస్తుంటారు. అయితే.. అది నిజమేమీ కాదట. అధిక మోతాదులో కాకుండా మితంగా తింటే నెయ్యి చాలా మంచిదట. ముఖ్యంగా చలికాలంలో నెయ్యి తింటే.. శరీరంలో వేడి పుడుతుందట. దీంతో చలి తట్టుకనే శక్తి పెరుగుతుంది.

2. చలికాలంలో బద్దకంగానూ, నీరసంగానూ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు నెయ్యి తింటే.. శక్తి పెరిగి.. యాక్టివ్ గా మారతారు. జలుబు, దగ్గులకు కూడా నెయ్యి చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. నెయ్యిని కొద్దిగా వేడి చేసి ముక్కులో రెండు చుక్కలు వేస్తే.. జలుబు దానంతట అదే తగ్గిపోతుందట.

3.చలికాలంలో చర్మం పగిలిపోవడం సర్వసాధారణం. ఆ సమస్య నుంచి నెయ్యి రక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది.

4. అంతేకాదు రోజూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటే.. మలబద్దకం సమస్య తగ్గిపోయి.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

click me!