ఉగాది పూజకు ఏమేం సామాగ్రి కావాలో తెలుసా?

Published : Mar 14, 2023, 01:46 PM IST
ఉగాది పూజకు ఏమేం సామాగ్రి కావాలో తెలుసా?

సారాంశం

Ugadi 2023: ఉగాది ఎంతో ప్రత్యేకమైన పండుగ.  ఉగాదికి విష్ణువును పూజిస్తారు. అయితే పూజలో కొన్ని వస్తువులను ఖచ్చితంగా ఉపయోగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే..  

Ugadi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఉగాది కర్ణాటక, తమిళనాడులో జరుపుకునే ఒక ప్రధాన పండుగ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది మార్చి 22న వచ్చింది. ఉగాదిని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇళ్లను పేడతో శుభ్రం చేసి ఇంటి ముందు భాగంలో రంగోలీలు వేస్తారు. ఉగాది పూజకు ఎలాంటి సామాగ్రి అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పువ్వులు

ఉగాదికి పువ్వులు చాలా అవసరం. పువ్వులతో దేవుడిని పూజించడమే కాదు ఇంటిని కూడా అలంకరిస్తారు. ముఖ్యంగా బంతిపూలు. ఉగాది పూజలకు పూలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటితో ఇంటిని కూడా చక్కగా అలంకరిస్తారు. 

మామిడి ఆకులు

మామిడి ఆకులు లేకుండా ఈ పండుగ సంపూర్ణం కాదు. మామిడి ఆకులతో ఇంటి తోరణాలను అలంకరిస్తే వచ్చే ఏడాది మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. ప్రజలు తమ ఇంటి ముందు పూలు, మామిడి ఆకులతో తోరణాలను అంకరిస్తారు. మామిడి ఆకులను పూజకు కూడా ఉపయోగిస్తారు. 

కొబ్బరి కాయ

భారతదేశంలో ప్రతి శుభకార్యానికి కొబ్బరి కాయను ఖచ్చితంగా వాడుతారు. ఉగాది పూజలో కలశంపై కొబ్బరికాయను పెట్టి విగ్రహం ముందు పెట్టి పూజ చేస్తారు. దీనివల్ల అంతా శుభమే జరుగుతుందని నమ్మకం.

వేప పువ్వు

వేపపువ్వును ఉగాది పచ్చడిలో వేస్తారు. చైత్ర మాసం మొదటి రోజున నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉగాదిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి సూర్యదేవుడికి ప్రార్థనలు చేస్తారు. పరిగడుపున ఈ వేపపువ్వును తిని ఉపవాసాన్ని విరమిస్తారు. 

ఆవుపేడ

హిందూ మతంలో ఆవును పవిత్రమైన జంతువుగా చూస్తారు. అందుకే ఆవుపేడ, గోమూత్రాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వాకిళ్లను పేడతో అలుకుతారు. అందమైన రంగురంగుల ముగ్గులనలు వేస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol: మందు తాగడానికి 2గంటల ముందు ఇలా చేస్తే మీ లివర్ డ్యామేజ్ అవ్వదు
విస్కీ కంటే బీర్ మంచిదా? ఇందులో నిజ‌మెంత‌.? అస‌లు నిపుణులు ఏమంటున్నారు.?