
1. ఆగ్రా..
భారతదేశంలో ఉన్న అద్బుతమైన కట్టడాల్లో ఆగ్రా ఒకటి. జీవితంలో ఈ ప్లేస్ కు ఒక్కసారైనా చూడాలనుకునే వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఈ స్మారక చిహ్నాన్ని చూడటానికి ప్రతి ఏడాది లక్షల మంది పర్యాటకులు వెలుతుంటారు. సూర్యోదయం వేళల్లో తాజ్ మహల్ ను చూస్తుంటే వచ్చే ఆ అనుభూతిని మీరెన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. అందుకే వెకేషన్ కు వెళ్లాలనుకునేవారు తప్పక ఈ ప్లేస్ కు వెళ్లండి.
2. న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జనాల రద్దీ మరీ ఎక్కువగాఉన్నప్పటికీ.. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఎన్నో రంగులతో దర్శనమిచ్చే ఈ రాజధాని నగరం ఎన్నో కట్టడాలకు నెలవు. పాత ఢిల్లీలోని జామా మసీదు, ఎర్రకోట, చాందినీ చౌక్ వంటివి మిమ్మల్ని కట్టి పడేస్తాయి.
న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్ కూడా ప్రర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది. అలాగే ఇండియా గేట్, హుమాయూన్ సమాధి, భారతదేశపు ఎత్తైన మినార్, కుతుబ్ మినార్, చాయ్ స్టాల్స్ , రెస్టారెంట్ల భోజనం.. వంటివన్నీ మిమ్మల్ని స్వర్గంలో విహరింపజేస్తాయంటే నమ్మండి.
3. ముంబై
భారతదేశంలో ఉన్న పర్యటక ప్లేసెస్ లో ముంబై కూడా ఒకటి. ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ , గౌర్మెట్ రెస్టారెంట్ల వంటకాలు నోరూరిస్తాయి. అంతేకాదు బాలీవుడ్, టాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఇక్కడే ఉంటారు.అంతేకాదండోయ్ సంపన్న పారిశ్రామిక వేత్తలు కూడా ముంబైలోనే జీవిస్తారు.
4. రాజస్థాన్
రాజస్థాన్ ను "రాజుల భూమి" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రాజస్థాన్ లో శతాబ్దాల రాజుల, రాణుల అవశేషాలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ మిరుమిట్లు గొలిపే రాజభవనాలు, కోటలు కూడా చూపరులను కట్టిపడేస్తాయి,
గోల్డెన్ ట్రయాంగిల్ టూరిస్ట్ సర్క్యూట్ లో జైపూర్, ఆగ్రా, న్యూ ఢిల్లీ కూడా ఉన్నాయి. ఇది రాజస్థాన్ లో సందర్శించాల్సిన టాప్ ప్లేసెస్ లో ఒకటి. "ది పారిస్ ఆఫ్ ఇండియా" అని పిలువబడే ఈ ప్లేస్ లో విలక్షణమైన పింక్ భవనాలు, విలాసవంతమైన సిటీ ప్యాలెస్, ఆకర్షించే ఆభరణాల దుకాణాలకు ఇది ప్రసిద్ధి చెందింది.
5. వారణాసి
ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో వారణాసి ఒకటి. ఇది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. పవిత్ర గంగానదిని దర్శించుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ పోతాయని భక్తులు నమ్ముతారు. వారణాసిలోని వీధులు మలుపులు.. అంతులేని చిట్టడివిలా ఉంటుంది.
6. అమృత్ సర్
అమృత్ సర్ నే "జ్యువెల్ ఆఫ్ పంజాబ్" అని కూడా అంటారు. ఈ ప్లేస్ లో స్వర్ణ దేవాలయంతో ఎంతో ప్రసిద్ధి కెక్కింది. సిక్కులకు ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన ఈ బంగారు కట్టడం సూర్యుని వెలుగులో మెరుస్తూ.. ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద కమ్యూనిటీ కిచెన్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ 100,000 మంది భోజనం చేస్తారు.
7. గోవా
గోవా బీచ్ ను ఇష్టపడని వారుండరు. ఇక్కడకు కొత్తగా పెళ్లైనా వారే కాదు.. సినీ తారలు. మామూలు జనాలు సైతం వెళుతుంటారు. కూరలు, సీఫుడ్ వంటకాలు ఇక్కడ నోరూరిస్తాయి.
8. కేరళ
జీవితంతో కేరళను ఎక్కసారైనా చూడాలనుకునే వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా.. పచ్చదనమే కనిపిస్తుంది. అంతేకాదు గలగలా పారే నదులు.. సీఫుడ్స్ .. నేచర్ అందాలతో.. రకరకాల వన్యప్రాణాలతో.. మొత్తంగా ఈ టూర్ ది బెస్ట్ టూర్ గా మారుతుంది.
9.అజంతా, ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలకు చరిత్ర గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. అజంతా గుహలు అత్యంత పురాతనమైనవి. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంతో రాతితో చెక్కిన 30 బౌద్ధ గుహ స్మారక చిహ్నాలు ఉన్నాయి. నైరుతి దిశలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలలో దాదాపు మూడు డజన్ల బౌద్ధ, జైన, హిందూ శిల్పాలు ఉన్నాయి. వీటిలో కైలాస ఆలయం (గుహ 16) అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇందులో శివుని భారీ నిర్మాణం ఉంది.