అంబులెన్స్‌కు తొలి మహిళా డ్రైవర్‌.. ఈమె కథ వింటే కన్నీళ్లాగవు!

By Navya ReddyFirst Published Aug 5, 2022, 2:44 PM IST
Highlights

ప్రస్తుత కాలంలో మహిళలు కూడా పురుషులకు పోటీగా ప్రతి ఒక్క రంగంలోనూ పురుషులకు సమానంగా దూసుకుపోతున్నారు. ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు కొనసాగుతూ మేమేం తక్కువ కాదంటూ మహిళా శక్తిని చాటుతున్నారు. అవని నుంచి అంతరిక్షం వరకు ప్రతి ఒక్క రంగంలోనూ తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. 

ఇప్పటికే ఎంతోమంది మహిళలు ఆటోలు నడుపుతూ కారు నడుపుతూ కుటుంబాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఓ మహిళ అంబులెన్స్ డ్రైవర్ గా మారి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ తొలి అంబులెన్స్ మహిళ డ్రైవర్ గా పేరు సంపాదించారు. అయితే ఈమె డ్రైవర్ కావడం వెనుక కథ తెలిస్తే మాత్రం కన్నీల్లాగవు.

కేరళలోని కొట్టాయం జిల్లా మెమురీ గ్రామానికి చెందిన దీపా మోల్ అనే మహిళకి ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇలా ఈమె కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు బైక్ ప్రయాణం చేస్తూ దేశం మొత్తం చుట్టేశారు. అయితే ఈమె భర్త అనారోగ్యం పాలవడంతో తాను మొదట్లో ఆటో డ్రైవర్గా టాక్సీ డ్రైవర్ గా మారి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి సేవా భావం కలిగినటువంటి దీపా మోల్ తాను అంబులెన్స్ కు డ్రైవర్ అయితే బాగుంటుందని భావించారు. ఈ క్రమంలోనే 2008లో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఈమె కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి తన ఆసక్తి చూపుతో ఒక లేఖ రాశారు.

ఈ విధంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఆమెను మహిళా దినోత్సవం రోజున అంబులెన్స్ డ్రైవర్ గా నియమించారు. తద్వారా ప్రభుత్వ ఆంబులెన్స్ నడుపుతున్న మొట్టమొదటి మహిళగా దీపా మోల్ చరిత్ర సృష్టించారు.చిన్నప్పటినుంచి సేవాగుణం డ్రైవింగ్ చేయడం దూర ప్రయాణాలు చేయడం ఇష్టం ఉన్నటువంటి ఈమెకు తన భర్త అనారోగ్యానికి గురవడంతో కుటుంబ పోషణ భారమై ఇలా అంబులెన్స్ డ్రైవర్ గా స్థిరపడ్డారు. అదేవిధంగా గతంలో త్రిస్సూర్ జిల్లా కున్నామ్‌కులంలో జరిగిన ఆఫ్-రోడ్ జీపు రైడింగ్ పోటీల్లో విజేతగా నిలిచారు.

సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్ అంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఒకరి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా అంబులెన్స్ డ్రైవర్ చేతిలో ఉంటుంది. కనుక ఈ వృత్తిలో ఉండాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలని అలాంటి సాహసాలు దీప మోల్ లో ఉన్నాయని నిరూపించుకున్నారు.ఇలా ఈమె ఈ వృత్తి ఎంచుకోవడం చూస్తుంటే మహిళలు దేనికి తీసిపోరని మహిళలంటే కేవలం వంటింటి కుందేలు కాదని నిరూపించుకుంటున్నారు.

click me!