Tholi Ekadashi 2022: తొలి ఏకాదశి నాడు ఈ తప్పులను చేయకండి..

By Mahesh RajamoniFirst Published Jul 10, 2022, 10:37 AM IST
Highlights

Tholi Ekadashi 2022: తెలుగు వారికి తొలి ఏకాదశి తొలి పండుగ. దీని తర్వాతే వేరే పండుగలు వరుసగా వస్తాయి. ఇలాంటి పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటి తప్పులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Tholi Ekadashi 2022: హిందూ సంప్రాదాయం ప్రకారం.. తెలుగువారు జరుపుకునే పండుగన్నీ.. తొలి ఏకాదశి తర్వాతే వస్తాయి. ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశినే ‘శయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు నుంచే  శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమిస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహా విష్ణువు  శేష పాన్పుపై నాలుగు నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమిస్తారన్న మాట. అంటే విష్ణు దేవుడు ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెల్లి.. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారన్న మాట. 

ఈ నాలుగు నెలలు పరమ పవిత్రమైన రోజులుగా పరిగణిస్తారు. ఇంతటి పవిత్రమైన రోజును ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తొలి ఏకాదశి నాడు అందరూ సూర్యోదయానికి  ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని శుచిగా తలస్నానం చేయాలి. పూజా గదిలో గంగాజలం చల్లి శుభ్రం చేసి.. విష్ణు మూర్తి పటానికి పసుపు, కుంకుమను పెట్టాలి. అలాగే ఆ దేవుడికి ఇష్టమైన పూలు, ఆకులతో అలంకరించి.. పూజా గదిముందు ముగ్గులు వేయాలి.  శ్రీ మహా విష్ణువుకి చక్కెర పొంగళి ఇష్టమైన పలారం. దీన్ని నైవేద్యంగా పెట్టండి. 

గుర్తుంచుకోండి.. పవిత్రమైన ఈ రోజున ఎవరూ అబద్దాలు ఆడకూడదు. చెడు ఆలోచనలను చేయకూడదు. దేవుడికి నిష్టగా ఉపవాసం ఉండండి. మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకండి. భక్తితో ఆ విష్ణునామస్మరణ చేయండి. భక్తితో రోజంతా పూజించండి. సాయంత్రం వేళ విష్ణు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోండి.  రాత్రంతా భక్తితో జాగారం చేయండి. మరుసటి రోజు అంటే ద్వాదశినాడు పొద్దున్నే తలస్నానం చేసి శ్రీ మహా విష్ణువుని నిష్టగా పూజించి నైవేధ్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించి.. భోజనం చేస్తే.. సకల పాపాలన్నీ తొలగిపోయి.. ఆ దేవుడి  దయం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 

ఈ రోజు పేదలకు మీకు తోచినంతలో దానం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మంచి విజయాలను కూడా అందుకుంటారు. 

ఈ ఏకాదశి పర్వదినాన పేలాల పిండిని కచ్చితంగా తినాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమంటంటే..మాంసాహారం, ఉసిరి, కాల్చిన ఆహారాలు, గమ్మడికాయ, మినుములు, మినుమలను తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

click me!