టీచర్స్ డే రేపే, ఈ రోజుకు ఎంతటి చరిత్ర ఉందో తెలుసా?

Published : Sep 01, 2023, 10:28 AM ISTUpdated : Sep 04, 2023, 09:26 PM IST
టీచర్స్ డే రేపే, ఈ రోజుకు ఎంతటి చరిత్ర ఉందో తెలుసా?

సారాంశం

Teacher's Day 2023: దేశవ్యాప్తంగా   ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 న టీచర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఈ టీచర్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవడం వెనుక ఎంత చరిత్రదాగుందో తెలుసా?   

Teacher's Day 2023: భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న  టీచర్స్ డేను జరుపుకుంటారు. ఈ రోజు విద్యావేత్తలను, గురువులను శిష్యులు గౌరవిస్తారు. వారి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కూడా. సర్వేపల్లి ధాకృష్ణన్ భారతదేశపు మొదటి ఉప రాష్ట్రపతి. అలాగే ఇండియా రెండో రాష్ట్రపతి.  ఇతను ఉపాధ్యాయుడే కాదు పండితుడు, తత్వవేత్త కూడా. ఈయన మరణించిన తర్వాత దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అతనికి లభించింది.

ఉపాధ్యాయ దినోత్సవం తేదీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా  సెలబ్రేట్ చేసుకుంటారు.

టీచర్స్ డే చరిత్ర

భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, దేశ రెండో రాష్ట్రపతి  అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని టీచర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గౌరవనీయ విద్యావేత్త. ఒకసారి అతని శిష్యులు.. భక్తితో మీ పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతిస్తారా అని అడిగారట. దానికి డాక్టర్ రాధాకృష్ణన్ ఒప్పుకేలేదట. కానీ సమాజానికి ఉపాద్యాయులు చేసిన కృషిని గుర్తించడానికి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా  జరుపుకోవచ్చని విద్యార్థులకు సూచించారట. అలా ఈ రోజు మొదలైంది. 

ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత

విద్యావేత్తలు, ఉపాధ్యాయులందరినీ గౌరవించడానికి, వారిపట్ల కృతజ్ఞతను చూపించడానికి ఈ రోజును ప్రతి ఏడాది జరుపుకుంటారు. భారతదేశం అంతటా స్కూల్స్, కాలేజీలు డాక్టర్ రాధాకృష్ణన్ కు నివాళులు అర్పిస్తూ ఈ రోజును జరుపుకుంటున్నాయి. చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కార్డులు, బహుమతులను ఇచ్చి వారి పట్ల ప్రశంస, కృతజ్ఞతను చూపిస్తారు.అలాగే పిల్లలు టీచర్స్ గురించి స్పీచ్ లు కూడా ఇస్తుంటారు. 

PREV
click me!

Recommended Stories

కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు