ఎండకాలం వచ్చిందంటే చాలు.. చెమటలు కారిపోతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా చంకల్లో చెమట, వాసన నలుగురిలో చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. మరి ఇలాంటి సమస్యనుంచి సులువుగా ఎలా బయటపడాలో తెలుసా? చూడండి మరి.
చాలా మందికి కేవలం వేసవిలోనే కాదు, మిగతా కాలాల్లో కూడా చంకల్లో చెమట, దుర్వాసన వస్తుంటుంది. దీని వల్ల వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. డ్రెస్ కూడా అక్కడి వరకు చాలా మురికిగా మారిపోతూ ఉంటుంది. మీకు కూడా చంకల్లో ఎక్కువగా చెమట పడుతూ, జిడ్డుగా ఉండి, దుర్వాసన వస్తుంటే కంగారు పడకండి. చంకలను పొడిగా, తాజాగా ఉంచే కొన్ని సులువైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
చంకల్లో చెమటతో ఇబ్బంది పడుతున్నారా?
1. టాల్కం పౌడర్, కార్న్‌స్టార్చ్ వాడండి
టాల్కం పౌడర్, మొక్కజొన్న పిండి తేమని పీల్చుకోవడానికి చాలా మంచివి.
స్నానం చేశాక చంకల్లో కొద్దిగా టాల్కం పౌడర్ రాయండి.
ఎక్కువగా చెమట పడితే కార్న్‌స్టార్చ్ రాసి, నెమ్మదిగా తట్టండి.
ఇది చెమటను పీల్చుకుని, చంకలను పొడిగా చేయడంతోపాటు దుర్వాసన రాకుండా చేస్తుంది.