stomach cancer Symptoms:ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పి, గుండెల్లో మంట వంటివి కడుపు క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు

Published : Jul 31, 2022, 01:01 PM ISTUpdated : Jul 31, 2022, 01:07 PM IST
 stomach cancer Symptoms:ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పి, గుండెల్లో మంట వంటివి కడుపు క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు

సారాంశం

Cancer Symptoms: పలు అధ్యయనాల ప్రకారం.. క్యాన్సర్.. కడుపు కణజాలాన్ని తయారు చేసే కణాల DNA లో మార్పులతో మొదలవుతుంది. ఈ మార్పుల  కారణంగా కణాలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. ఇవి రెట్టింపై కడుపులో కణితులు ఏర్పడుతాయి.  

Cancer Symptoms: జీర్ణవ్యవస్థలో కడుపు అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మనం తినే ఆహారం అన్నవాహిక గుండా కడుపులోకి వెళుతుంది. అయితే ఏవైనా కారణాల  వల్ల కడుపు ఏ విధంగానైనా ప్రభావితమైతే.. దాని విధులన్నీ దెబ్బతింటాయి.

అయితే కొన్ని రకాల జీర్ణ సమస్యలు కడుపు క్యాన్సర్ కు కారణాలు కావొచ్చంటున్నారు నిపుణులు.ఈ  వ్యాధి కడుపును ప్రభావితం చేస్తుంది. కడుపు క్యాన్సర్.. కడుపులోని ఏ భాగంలోనైనా  అసాధారణ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే పరిస్థితి. 

కడుపు క్యాన్సర్ పెరగడానికి సంవత్సరాల టైం పడుతుంది. అందులోనూ దీన్ని గుర్తించడం చాలా కష్టం. దీనివల్ల ఈ క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్ కడుపు నుంచి ఊపిరితిత్తులు, కాలేయం, ఎముకలకు వ్యాపిస్తుంది.

ఇతర క్యాన్సర్ల మాదిరిగానే కడుపు క్యాన్సర్ ఎందుకు వస్తుందనే స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు లేదు. దీని వెనుక ఎన్నో కారణాలుండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఓ అధ్యయనం ప్రకారం.. కడుపు కణజాలాలను తయారు చేసే డిఎన్ఎ కణాలలో మార్పుతో క్యాన్సర్ మొదలవుతుంది. ఈ మార్పుల కారణంగా.. కణాలు త్వరగా పెరిగి రెట్టింపు అవుతాయి. ఇవి కలిసి కణితిని ఏర్పరుస్తాయి.

వంశపారంపర్యంగా, ఊబకాయం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానలు ఎక్కువగా తినడం, ఎ-రకం రక్తం ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారాలను ఎక్కువగా తీసుకుంటూ కూరగాయలు, పండ్లను తక్కువగా తినే వారు, స్మోకింగ్ చేయడం, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఇతర కడుపు సంబంధిత సమస్యలకు,  కడుపు క్యాన్సర్ కు దారితీయొచ్చు.

కడుపు  క్యాన్సర్ లక్షణాలు

ఇంతుకు ముందు చెప్పినట్టుగా కడుపు క్యాన్సర్ ను అంత తొందరగా గుర్తించలేము. అందుకే చాలా మంది దీని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొన్ని సాధారణ లక్షణాలు కనిపించినా.. ఉదర సంబంధ వ్యాధులుగా భావించి..లైట్ తీసుకుంటారు. అందుకే కడుపు క్యాన్సర్ లక్షణాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 

వికారం, గుండెల్లో మంట, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి,  జీర్ణ సమస్యలు, మలంలో రక్తం కారడం, ఆహారాన్ని మింగడానికి కష్టంగా ఉండటం,  బరువు తగ్గడం, కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారడం, కడుపు ఉబ్బరం, వాంతులు వంటివి కడుపు క్యాన్సర్ కొన్ని లక్షణాలు.

అయితే ఈ లక్షణాలు ఎన్నో ఉదర రుగ్మతల లక్షణాలు కూడా. ఈ లక్షణాలలో ఏ ఒక్కదాన్నైనా చాలా కాలం నుంచి ఎదుర్కొంటుంటే.. ఆలస్యం చేయకుండా ఆస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది కడుపు క్యాన్సర్ లక్షణం కావొచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది