పురుషులలోనే కాదు.. ట్రాన్స్ జెండర్ లలోనూ వీర్యం ఉత్పత్తి

By telugu teamFirst Published Aug 9, 2019, 12:44 PM IST
Highlights

లింగమార్పిడి చేయించుకొని మహిళలుగా మారిన వారిలో వీర్యం ఉత్పత్తి సాధ్యమౌతుందని అమెరికాలోని మ్యాగీ-ఉమెన్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. మగతనాన్ని అణచివేసే మందుల వాడకం ఆపేసిన తర్వాత కూడా వారిలో వీర్యం ఉత్పత్తిని గమనించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

సంతానోత్పత్తికి వీర్యం అవసరం. అది పురుషుల్లో ఉత్పత్తి అవుతుందన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే... కేవలం పురుషుల్లోనే కాదు.. ట్రాన్స్  జెండర్లలో కూడా వీర్యం ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మీరు చదివింది నిజమే.

లింగమార్పిడి చేయించుకొని మహిళలుగా మారిన వారిలో వీర్యం ఉత్పత్తి సాధ్యమౌతుందని అమెరికాలోని మ్యాగీ-ఉమెన్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. మగతనాన్ని అణచివేసే మందుల వాడకం ఆపేసిన తర్వాత కూడా వారిలో వీర్యం ఉత్పత్తిని గమనించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు మహిళలు తిరిగి సంతానోత్పత్తి పొందడానికి ప్రయత్నించిన కేసులను శాస్త్రవేత్తలు పరిశీలించగా.. ఈ విషయం తేలినట్లు వారు  చెబుతున్నారు. ఈ రెండు కేసుల్లో హార్మోన్ చికిత్సను ఆపేసిన తర్వాత కూడా వారిలో వీర్యం వృద్ధి చెందినట్లు గమనించారు.

అదేవిధంగా లింగమార్పిడి చేయించుకొని ఇంకా హార్మోన్ చికిత్స తీసుకోని మరో ఎనిమిది మంది వీర్యంతో ఆ ఇద్దరి వీర్యాన్ని పోల్చిచూశామని శాస్త్రవేత్తలు చెప్పారు. హార్మోన్ చికిత్సలో భాగంగా లుప్రాన్ అనే ఔషదాన్ని తీసుకుంటున్న ఓ మహిళకు ఆ మందుల్ని నిలిపివేశారు. ఐదు నెలల తర్వాత గమనించగా.. ఆమెలో వీర్యం ఉత్పత్తి సాధ్యమైనట్లు  చెప్పారు. దీనిని బట్టి.. లింగమార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండర్లు కూడా పిల్లల్ని కనడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

click me!