Sleepy Face: నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బిపోయి ఉండటానికి అసలు కారణం ఇదే..

Published : Feb 10, 2022, 11:46 AM IST
Sleepy Face: నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బిపోయి ఉండటానికి అసలు కారణం ఇదే..

సారాంశం

Sleepy Face: చాలా మందికి నిద్రలేచిన తర్వాత ముఖం ఉబ్బిపోయి ఉంటుంది. అలాగే కళ్లు కూడా వాచిపోయి ఉంటాయి. సరిగ్గా నిద్రపోయిన తర్వాత కూడా ఇలా ముఖం, కళ్లు వాయడానికి అసలు కారణాలు ఇవే..  

Sleepy Face: కంటినిండా నిద్రపోయినా గానీ చాలా మందికి నిద్రలేచిన తర్వాత వారి ఫేస్ ఉబ్బిపోయి ఉంటుంది. అలాగే కళ్లు కూడా వాచినట్టుగా అనిపిస్తాయి. వీటిమూలంగా వారి ఫేస్ లో లేజీనెస్ కనిపిస్తుంది. అలాంటి వారిని చూసినప్పుడు వీళ్లకు నిద్ర సరిపోలేదేమో.. ఇప్పుడు కూడా నిద్రవస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఫేస్ అలా అవడానికి వారు ఎక్కువ సేపు పడుకోవడం కూడా ఒక కారణమేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనికి అసలు కారణంగా ఇంకా తెలియలేదు. అయితే ఇలా ముఖం, కళ్లు వాచిపోతే వారికి ఎదో జబ్బు రాబోతుందంటూ కొందరు ఆంధోళన పడిపోతుంటారు. నిజానికి ఇలా వాచిపోవడం ఆరోగ్యకరమైన సమస్య ఏం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఫేస్ ఇలా మారిపోవడానికి కొన్నిశాస్త్రీయ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. మన జీవనశైలీ, మన ఆహారపు అలవాట్లతో పాటుగా మనం నిద్రపోయే భంగిమలు కూడా దీనికి కారణాలుగా చెప్పుకుంటారు. ముఖం, కళ్లు వాపుకుగురవ్వడాన్ని ‘ఫేషియల్ పఫ్నెస్’అని కూడా అంటారు. అంటే ముఖ కణజాలం వాపుకు గురవ్వడం. లేదా ముఖ కణజాలంలో  ద్రవం నిల్వ ఉండటం వల్ల కూడా ముఖం వాచిపోతుంది. కాగా ఈ కణజాలం చర్మం కింద ఉంటుంది. తద్వారా ముఖం వాచిపోతుంది.

మెడికల్ న్యూస్ టుడేలో ప్రచురించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొన్ని కొన్ని సార్లు నిద్రిస్తున్నన సమయంలో మీ ముఖం చుట్టూ సాధారణం కంటే ఎక్కువ ద్రవం పేరుకు పోతుంది. ఇలా ప్రక్రియ రాత్రి వేళల్లో కంటే పగటి సమయంలోనే ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ ద్రవాలు మనం పడుకున్న సమయాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటుంది. కాగా మీరు వెనక్కి తిరిగి పడుకుంటే మీ ముఖంపై ఉండే ద్రవాలు వేరే  మార్గంగుండా ప్రయాణించడం వల్ల ముఖం వాపుకు గురవుతుంది. కాబట్టి ఈ సమస్యను పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదు. 

అతిగా నిద్రపోయే వారిలో కూడా ద్రవాలు ఎక్కువగా చేరి ముఖం వాపుకు గురిచేస్తుంది. ఈ వాపు ఎక్కువ సేపు ఉండదు. నిద్రలేచిన వెంటనే కొద్ది సేపు వాకింగ్ చేసినా లేదా నిలబడినా వాపు తగ్గుతుంది. అంతేకాదు ముఖంపై చేరుకున్న ద్రవాలు ఇలా చేస్తే వాటికమే పోతాయి. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఆల్కహాల్, మేకప్, ఒత్తిడి, సైనస్, అలెర్జీలు, కుషింగ్స్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం కారణాల మూలంగా కూడా ముఖం ఇలా వాస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్లీపింగ్ పోజీషన్ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖం కిందికి పెట్టి పడుకునే వారి ముఖమే ఎక్కువగా వాపు వస్తుందట. కాబట్టి అలా పడుకునే అలవాటుంటే వెంటనే అలా పడుకోవడం మానుకోవడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు