నడుము నాజుకుగా మారాలంటే...

By ramya NFirst Published Feb 4, 2019, 4:21 PM IST
Highlights

అమ్మాయిల అందాన్ని పొగడే క్రమంలో నడుముని సన్నజాజి తీగతో పోలుస్తారు. సన్నజాజి తీగ చాలా సన్నగా ఉంటుంది. అదేవిధంగా నడుము సన్నగా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారనే నానుడి.

అమ్మాయిల అందాన్ని పొగడే క్రమంలో నడుముని సన్నజాజి తీగతో పోలుస్తారు. సన్నజాజి తీగ చాలా సన్నగా ఉంటుంది. అదేవిధంగా నడుము సన్నగా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారనే నానుడి. అందుకే చాలా మంది అమ్మాయిలు పొట్టమాడ్చుకొని మరీ సన్నగా మారేందుకు ప్రయత్నిస్తుంటారు. 

అయితే.. బరువు తగ్గాలనే తాపత్రయంతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మరి సులభంగా.. ఆరోగ్యంగా బరువు తగ్గి.. అందాన్ని సొంతం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆకలి వేయడానికి అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలు అందిస్తుంది. ఆ సూచనలను గమనించి ఆకలివేసిన వెంటనే భోజనం చేయాలి. ఆలస్యం చేయకూడదు. అదేవిధంగా కడుపు నిండింది అనిపించగానే తినడం ఆపేయాలి. బలవంతంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోకూడదు.

ఎంత తిన్నా.. ఏది తిన్నా.. టైమ్ కి తినాలి. భోజనం చేయడం అస్సలు మానేయకూడదు. ఉదయంపూట బ్రేక్ ఫాస్ట్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రాగులు, గోధుమలు, సజ్జలు లాంటివి తీసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం గంట ముందే రాత్రి భోజనం చేసేయాలి.

సరిపోను నిద్ర ఉండాలి. రోజుకి కనీసం 7గంటల నిద్ర చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. అవేవిధంగా రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. 

click me!