నవరాత్రి తొమ్మిది రంగుల గురించి మీకు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా..?

By Mahesh Rajamoni  |  First Published Sep 26, 2022, 12:01 PM IST

నవరాత్రి రంగులేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు.. మరి ఈ రంగులు దేన్ని సూచిస్తున్నాయి.. వీటి ప్రాముఖ్యత ఏంటన్న సంగతి ఎంతమందికి తెలుసు? 


నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి దుర్గాదేవిని తొమ్మిది రోజులు నిష్టగా పూజిస్తారు. అందులో దుర్గా దేవిని ఈ తొమ్మిది రోజులల్లో ఒక్కో రోజూ ఒక్కో రూపంలో కొలుస్తారు. అలాగే ఒక్కో రంగుల్లో అలంకరిస్తారు. ఇంతకీ రంగులు ప్రాముఖ్యత  ఏంటి.? దుర్గాదేవిని ఈ తొమ్మిది రంగులతో అలంకరించడానికి కారణాలేంటో తెలుసుకుందాం పదంది. 

1. ఆకుపచ్చ రంగు: కుశ్మద అవతారంలో ఉన్న అమ్మవారును ఆకుపచ్చరంగుతో అలంకరిస్తారు.  కుశ్మందే ఈ లోకాన్ని పుట్టించదని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవీ అనుగ్రహంతోనే ఈ ప్రపంచం పచ్చని చెట్లు, అడవులతో ఇంత అందంగా ఉందని భావిస్తారు. ఆకుపచ్చ రంగు కొత్త ప్రారంభాలు, సంపద, విజయం స్వభావాన్ని సూచిస్తుంది.

Latest Videos

undefined

2. బూడిద రంగు: స్కందా మాత అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారిని బూడిద రంగుతో దుస్తులతో అలంకరిస్తారు. ఈ రంగు నిశ్చలమైన స్వభావాన్ని , భావోద్వేగ మానసిక స్థితికి,  ప్రశాంతతకు,  శక్తివంతమైన నిర్ణయం తీసుకునే స్వభావాన్ని తెలియజేస్తుంది. 

3. గులాబీ: గులాబీ రంగు ప్రజల మధ్య దయ, ప్రేమ, సామరస్యం, ఆప్యాయతను సూచిస్తుంది. అందుకే దుర్గామాతకు పూజ చేసేటప్పుడు చాలా మంది వివిధ గులాబీ రంగు దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడతారు. 

4. నెమలి ఆకుపచ్చ: నెమలి ఆకుపచ్చ అలంకారంలో ఉన్న దుర్గామాత అందరి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని ఆశీర్వదిస్తుంది. ఈ రంగు కరుణ, ప్రశాంతత,  ప్రత్యేకత, వ్యక్తిత్వం భావాన్ని సూచిస్తుంది.

5. ఎరుపు  రంగు అలంకారంలో ఉన్న దుర్గామాతను మొదటి రోజు పూజిస్తారు. ఈ రంగు చాలా శక్తివంతమైంది. ఈ రంగు ధైర్యానికి, అభిరుచికి, శక్తికి, ప్రేమ కు ప్రతీక. దుర్గామాత పూజ సమయంలో చాలా మంది ఈ ఎరుపు రంగు దుస్తులనే వేసుకుంటుంటారు. 

6. నారింజ రంగు: దుర్గామాత కాత్యాయనీ అవతారంలో ఉన్నప్పుడు నారింజ రంగుతో అలంకరిస్తారు. ఈ నారింజ రంగు వెనుకు గొప్ప కథ ఉంది. అయితే ఈ రంగు సానుకూలత, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక. అందుకే నవరాత్రుల్లో ఎక్కువ  మొత్తంలో ఈ రంగు దుస్తులనే వేసుకుంటుంటారు. 

7. రాయల్ బ్లూ: ఈ రంగు ప్రశాంతతకు, గొప్పతనానికి, ప్రతీక. అందుకే ఈ రోజు దుర్గామాతను రాయల్ బ్లూ కలర్ రంగులో అలంకరిస్తారు. అలాగే ఆలయాన్ని రాయల్ బ్లూ రంగు పూలతో డెకరేట్ చేస్తారు. 

8. తెలుపు: నవరాత్రుల్లో చాలా మంది వైట్ కలర్ దుస్తులనే ఎక్కువగా ధరిస్తారు. కాళరాత్రి అవతారంలో దుర్గామాతను తెలుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గామాత దుష్టులను అంతంచేసే అవతారంలో భయానకంగా ఉంటుంది.  ఈ రంగును శాంతికి, ప్రార్థనకు ప్రతీక. 

9. పసుపు: చంద్రగంట అవతారంలో ఉన్నప్పుడు దుర్గామాతను పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు.  పసుపు రంగు ఈ పండుగ సీజన్‌లో ఆనందం, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ రంగు ధైర్యానికి ప్రతీక. 

click me!