మహిళలకు శుభవార్త... కేవలం రూపాయికే శానిటరీ న్యాప్ కిన్స్

By telugu teamFirst Published Aug 27, 2019, 12:56 PM IST
Highlights

గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.10 గా ఉండేది. ఇకపై దానిని కేవలం రూ.4కే అందించనున్నట్లు ఆయన చెప్పారు. అంటే ఒక్కో శానిటరీ ప్యాడ్ కేవలం రూ.1కే అందనుంది.
 

మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. శానిటరీ న్యాప్ కిన్లను కేవలం ఒక్క రూపాయికే అందించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రసాయన, ఎరువుల శాఖా సహాయ మంత్రి మన్ కుశ్ ఎల్. మాండవియా ఓ ప్రకటనలో వెల్లడించారు. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.10 గా ఉండేది. ఇకపై దానిని కేవలం రూ.4కే అందించనున్నట్లు ఆయన చెప్పారు. అంటే ఒక్కో శానిటరీ ప్యాడ్ కేవలం రూ.1కే అందనుంది.

‘ కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్‌తో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా జన్‌ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి’ అని మాండవియా తెలిపారు. వీటి అమ్మకాల ఆధారంగా కేటాయించాల్సిన బడ్జెట్‌ను నిర్ణయిస్తామన్నారు. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన సానిటరీ న్యాప్‌కిన్ల పథకం ద్వారా దాదాపు ఔషధి స్టోర్ల నుంచి దాదాపు 2.2 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.

ప్రస్తుతం ధరలు సగానికి పైగా తగ్గడం ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నాణ్యతతో కూడిన పర్యావరణహిత న్యాప్‌కిన్ల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. ఇక న్యాప్‌కిన్ల ధరను 60 శాతానికి తగ్గించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన పేర్కొన్న హమీని నిలబెట్టుకుట్టుందని పేర్కొన్నారు.
 

click me!