ఇక బట్టతలకు స్వస్తి... ఇంజెక్షన్ తో జట్టు

By telugu teamFirst Published Aug 29, 2019, 3:47 PM IST
Highlights

బట్టతలతో రాలిపోయిన జుట్టును మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశారు దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు. జుట్టు మళ్లీ పెరగడంలో కీలకపాత్ర పోషించే వివిధ అంశాలపై పరిశోధనలు చేసి.. సరికొత్త ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశామని సంస్థ సహ వ్యవస్థాపకులు, ప్రముఖ కాస్మెటిక్‌ సర్జన్‌ డేబ్‌రాజ్‌ షోమ్‌ తెలిపారు.

జట్టురాలే సమస్యతో బాధపడేవారు దేశంలో చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా కాలుష్యం, సరైన పోషకాహారం, జన్యులోపాలతో  ప్రస్తుత కాలంలో చాలా మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. మరీ దారుణంగా కనీసం 30ఏళ్లు కూడా రాకుండానే ఈ సమస్యతో బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. కొందరు ఏమీ చేయలేక వదిలేస్తుంటే.. మరి కొందరు మాత్రం లక్షలు వెచ్చించి హెయిర్ ప్లాంటేషన్  చేయించుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఊడిపోయే జట్టును ఆపలేకపోతున్నామని బాధపడుతున్నారు. అయితే అలాంటి వారికి ఇది నిజంగా శుభవార్త

బట్టతలతో రాలిపోయిన జుట్టును మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశారు దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు. జుట్టు మళ్లీ పెరగడంలో కీలకపాత్ర పోషించే వివిధ అంశాలపై పరిశోధనలు చేసి.. సరికొత్త ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశామని సంస్థ సహ వ్యవస్థాపకులు, ప్రముఖ కాస్మెటిక్‌ సర్జన్‌ డేబ్‌రాజ్‌ షోమ్‌ తెలిపారు.

 దీని పేరు ‘క్యూఆర్‌ 678’ అనీ, దీనికి అన్ని పరీక్షలూ పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పటికే వెయ్యి మందిపై ఈ ఇంజక్షన్‌ను పరీక్షించి విజయం సాధించామన్నారు. దీనిలో అన్నీ సహజ ఉత్ర్పేరకాలేనని చెప్పారు. ఈ ఇంజక్షన్‌ను మూడు వారాలకొకసారి చొప్పున మొత్తం ఎనిమిదిసార్లు చేయించుకోవాలని చెప్పారు. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ. 6 వేలు మాత్రమేనని, మొత్తం చికిత్సకు రూ. 48 వేలు ఖర్చవుతుందని తెలిపారు.

click me!