Mobile Phone: దీనిపై క్లిక్ చేశారంటే అంతే.. మీకు తెలియకుండానే మీ ఫోన్లో వీడియో రికార్డ్ చేయొచ్చు!

Published : Mar 05, 2025, 03:46 PM IST
Mobile Phone: దీనిపై క్లిక్ చేశారంటే అంతే.. మీకు తెలియకుండానే మీ ఫోన్లో వీడియో రికార్డ్ చేయొచ్చు!

సారాంశం

ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్ వాడుతున్నారు. నిజానికి ఫోన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల ప్రైవేటు వీడియోలు తీయడం ఎక్కువై పోయింది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకోండి.

ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే మొబైల్ అవసరం కూడా. కానీ ఫోన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మధ్య చాలా సమస్యలకు ఫోన్ కారణం అవుతోంది. హ్యాకర్ల బెడద బాగా ఎక్కువైపోయింది. తెలియకుండా అకౌంట్లో డబ్బులు కొట్టేసే హ్యాకర్లు కొందరైతే, అమ్మాయిల ప్రైవేటు వీడియోలు తీసి వైరల్ చేసేవారు మరికొందరు. 

అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి రకరకాల సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారనే వార్తలు మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇది అమ్మాయిల జీవితంలో పెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. కొందరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. 

సాధారణంగా స్నానం చేసేటప్పుడు లేదా బట్టలు మార్చుకునేటప్పుడు అమ్మాయిలు మొబైల్‌లో వీడియోలు తీయరు. అక్కడ ఎక్కడా హిడెన్ కెమెరా కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వీడియో ఎలా వచ్చింది. ఎలా వైరల్ అయిందనే ప్రశ్న అందర్ని వెంటాడుతుంటుంది. ప్రతి అమ్మాయి ఇలాంటి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రమాదం నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.

మొదటగా అమ్మాయిలు ఎప్పుడూ మొబైల్‌ను చేతిలో పట్టుకొని తిరగకూడదు. చాలామంది అమ్మాయిలు బాత్‌రూమ్‌కు మొబైల్ తీసుకెళ్తారు. బట్టలు మార్చుకునేటప్పుడు కూడా మొబైల్ వాళ్ల దగ్గరే ఉంటుంది. బెడ్‌రూమ్‌లో ఎక్కడంటే అక్కడ మొబైల్ పడేస్తుంటారు. మొబైల్ ఆఫ్ అయింది కదా.. కెమెరా ఆన్ కాలేదని అనుకుంటారు. కానీ హ్యాకర్లు చాలా తెలివిగా అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు వీడియో తీస్తుంటారు.

కెమెరా ఆఫ్ చేసినా వీడియో ఎలా రికార్డు అవుతుంది?

మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులే పెద్ద సమస్యకు కారణమవుతాయి. మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఏదైనా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసే సమయంలో ఒక పాప్ అప్ మెసేజ్ వస్తుంది. అందులో ఫోన్ కెమెరాకు అనుమతి అడుగుతారు. మనం తెలియకుండానే దానికి ఓకే అని నొక్కుతాం. హ్యాకర్లు దీన్ని ఉపయోగించి వీడియోలు తయారు చేస్తారు. మీకు తెలియకుండానే మీ కెమెరా ఆన్ అయి వీడియో రికార్డు అవుతుంది.

హ్యాకర్ల నుంచి రక్షణ ఎలా?

హ్యాకర్ల చేతిలో మోసపోకూడదంటే ఎక్కడికి పడితే అక్కడికి మొబైల్ తీసుకెళ్లకండి. మరీ ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు మీరు ఆన్ చేయకుండానే మీ మొబైల్ బ్యాటరీ దగ్గర గ్రీన్ లైట్ వస్తుందో లేదో గమనించండి. ఒకవేళ మీరు కెమెరా తెరవకుండానే గ్రీన్ లైట్ వస్తుంటే మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం.

వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మొబైల్ సెట్టింగ్స్‌కు వెళ్లి, అప్లికేషన్‌కు ఇచ్చిన కెమెరా అనుమతిని రద్దు చేయండి. ప్రతిసారి బ్రౌజర్ వాడేటప్పుడు లేదా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు మీరు దేనికి ఒకే చెప్తున్నారో గమనించండి. మీకు తెలియని ఏ అప్లికేషన్‌కు కెమెరా పర్మిషన్ ఇవ్వకండి.

PREV
click me!

Recommended Stories

రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్