Palmyra Fruit Benefits : తాటిముంజలను తింటున్నారా? లేదా?లేదంటే మీరు ఆ ప్రయోజనాలన్నింటినీ మిస్ అయిపోతారు

Published : Mar 25, 2022, 09:34 AM ISTUpdated : Mar 25, 2022, 09:36 AM IST
Palmyra Fruit Benefits : తాటిముంజలను తింటున్నారా? లేదా?లేదంటే మీరు ఆ ప్రయోజనాలన్నింటినీ మిస్ అయిపోతారు

సారాంశం

Palmyra Fruit Benefits : తాటిముంజలను ఎక్కువగా తినడం వల్ల వేసవి దాహం ఇట్టే తీరిపోతుంది. డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మం వ్యాధులు కూడా ఇట్టే తగ్గిపోతాయి.   

Palmyra Fruit Benefits : వేసవి వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో తాటిముంజలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవివేసవి తాపాన్ని తీర్చడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. ఈ సీజనల్ పండ్లు ఇతర పండ్లలాగే ఎన్నో ఔషదగుణాలను కలిగున్నాయి. అందుకే ఈ సీజన్ లో జనాలు ఎక్కువగా తింటుంటారు. పుచ్చకాయ మాదిరిగానే ఈ పండు నీటి క్వాంటిటీని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ పండును తింటే ఈ కాలంలో డీహైడ్రేషన్ బారిన పడతామన్న భయం కూడా ఉండదు. అంతేకాదు అలసటను , దాహాన్ని కూడా తీర్చుతుంది. 

ముట్టుకుంటే సర్రున జారిపోయే స్వభావమున్న ఈ తాటిముంజలు ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే లభించేవి. ఇప్పుడు పట్టణాల్లో కూడా  పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ సీజన్ లొ ఇతర పండ్లకంటే ఈపండ్లకే గిరాఖీ ఎక్కువగా ఉంటుంది. చల్ల చల్లగా ఉండే ఈ పండ్లు.. నోట్లో అలా పెట్టుకోగానే కడుపులోకి ఇలా జారిపోతాయి. ఈ తాటి ముంజలనే ‘ఐస్  యాపిల్స్’ అని కూడా పిలుస్తారు. 

ఈ పండ్లలో పొటాషియం, రిబో ప్లెవీస్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పాస్పరస్, ఐరన్, దయామిన్, ఐరన్, బి కాంప్లెక్స్, జింక్, రిబో ప్లెవీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కాలెయ సంబంధిత రోగాలు రాకుండా చూస్తాయి. అంతేకాదు ఈ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. 

ముదురు తాటిముంజలపై తొక్కను తొలగించి తిన్నా.. పర్లేదు కానీ లేత తాటిముంజలపై తొక్కను తొలగించకంటి. వాటిని అలాగే తినేయండి. అలా తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. వీటిని తినడం వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉంుటంది. జీర్ణక్రియ సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. 

ఈ ఎండాకాలం చర్మ సమస్యలు విపరీతంగా వేధిస్తుంటాయి. అయితే తాటిముంజలను తింటే స్కిన్ కు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. చెమట కాయలను తగ్గించడానికి తాటిముంజలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కాలిన గాయాలను మాన్పిస్తుంది. దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

వేసవికాలం డీహైడ్రేషన్ బారిన పడకూడదంటే.. తాటిముంజలను ఎక్కువగా తినండి. అంతేకాదు ఇవి  వేసవి తాపాన్ని కూడా తీర్చుతాయి. వడదెబ్బ కొట్టిన వాళ్లకు ఐస్ యాపిల్స్ తో  జ్యూస్ చేసి తాగిస్తే.. వారు తొందరగా కోలుకుంటారు. 

PREV
click me!

Recommended Stories

Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి