ఎప్పుడూ అదే ధ్యాస..?

By telugu teamFirst Published Jun 25, 2019, 4:05 PM IST
Highlights

మా ఆయనకు ఎప్పుడూ అదే ధ్యాస.  సెక్స్ కోసం తప్పించి.. జీవిత భాగస్వామిగా నాపై అసలు ప్రేమే చూపించడం. శారీరిక కోరిక తీర్చడానికి మాత్రమే నేను పనికొస్తానా..? అంటూ భర్తలపై కస్సుబుస్సులు ఆడుతుంటారు.

భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు రావడం సహజం. అలకలు, బుజ్జగింపులు లేకపోతే అసలు అది సంసారమే కాదు. అయితే... శృంగారం విషయంలో చాలా మంది భర్తలపై భార్యలకు కంప్లైంట్స్ ఉంటాయి. అందులో ప్రధానమైనది.. మా ఆయనకు ఎప్పుడూ అదే ధ్యాస.  సెక్స్ కోసం తప్పించి.. జీవిత భాగస్వామిగా నాపై అసలు ప్రేమే చూపించడం. శారీరిక కోరిక తీర్చడానికి మాత్రమే నేను పనికొస్తానా..? అంటూ భర్తలపై కస్సుబుస్సులు ఆడుతుంటారు.

నిజానికి భర్తలకు అలాంటి ఉద్దేశం ఉండకపోవచ్చు. భార్యపై అమితమైన ప్రేమ ఉన్నా.. అది వేరే విధంగా చూపించడం వాళ్లకు  తెలియకపోవచ్చు అంటున్నారు నిపుణులు.

శరీరంలోని టెస్టోస్టెరాన్‌ హార్మోను స్త్రీ పురుషుల్లో లైంగికత్వాన్ని నిర్ణయిస్తుంది. టెస్టోస్టెరాన్‌ స్త్రీలతోపోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. మగవారిలో ఆ హార్మోన్‌ ప్రవాహం పది నుంచి ఇరవై రెట్లు అధికం. దాని వల్ల పురుషుల్లో కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అది కాస్త స్త్రీలకు అంతగా నచ్చకపోవచ్చు.

దానికి తోడు మగవారు కాస్త మోటుగా ప్రవర్తిస్తుంటారు. ఆ తీరు కూడా స్త్రీలకు నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో భర్తకు తమపై ప్రేమలేదని.. కేవలం తన శరీరం మాత్రమే అవసరమనే భావన ఏర్పడింది. కాబట్టి సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి భార్యతో ప్రేమగా వ్యవహరిచాలి. మాటలతో మురిపించి మైమరిపించాలి. అలా చేస్తే... భర్తలపై భార్యలకు చులకన భావన ఉండదంటున్నారు నిపుణులు.  

click me!