సెక్స్ సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు

By telugu team  |  First Published Jun 21, 2019, 3:29 PM IST

సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా మంది చాలా చేస్తుంటారు. వయాగ్రా, రకరకాల మందులు వాడటం.. సామర్థ్యాన్ని పెంచే ఆహారం లాంటివి తీసుకుంటూ ఉంటారు. 



సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా మంది చాలా చేస్తుంటారు. వయాగ్రా, రకరకాల మందులు వాడటం.. సామర్థ్యాన్ని పెంచే ఆహారం లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే... అవేమీ అవసరం లేకుండా  యోగాతో సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎంత బిజీగా ఉన్నా కూడా  రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోవాలి. రోజుకు ఓ గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే యోగా కచ్చితంగా చేయాలి. ముఖ్యంగా యోగాలో చేసే నాలుగు ఆసనాల ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 

Latest Videos

సెక్సువల్ ఫిట్‌నెస్‌కు, యోగాకు మంచి సంబంధముందని, ఇది రెగ్యులర్‌గా చేయడం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని యోగా గురువులు చెబుతున్నారు. 

యోగా అనేది జీవిత భాగస్వాములిద్దరికీ దివ్యౌషధం లాంటిది. యోగాలో పద్మాసనం చాలా ముఖ్యమైనది. ఇది మనిషి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా మనసు నియంత్రణలో ఉండి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. 

ధనురాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, హలాసనం, సూర్య నమస్కారం వంటి ఆసనాలు చేయడం ద్వారా కూడా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆసనాలతో మీలోని శృంగార సామర్థ్యాన్ని మరింత రెట్టింపు చేసుకోండి.

click me!