కొడుకు ‘గే’ అని.. సంతానం కోసం ఓ తల్లి ఏం చేసిందంటే...

By ramya N  |  First Published Apr 3, 2019, 2:56 PM IST

తనకు కొడుకు పుట్టగానే ఓ తల్లి సంతోషపడింది. తమ వంశాన్ని కొడుకు నిలబెడతాడని ఆశపడింది. కానీ యుక్త వయసు వచ్చేసరికి తన కొడుకుకి సంతానం కలగదు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. 


తనకు కొడుకు పుట్టగానే ఓ తల్లి సంతోషపడింది. తమ వంశాన్ని కొడుకు నిలబెడతాడని ఆశపడింది. కానీ యుక్త వయసు వచ్చేసరికి తన కొడుకుకి సంతానం కలగదు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. తన కొడుకు గే అన్న విషయం తెలుసుకొని మొదట ఆ తల్లి చాలా బాధపడింది. కానీ చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. కొడుకు బిడ్డ కోసం ఆమె మళ్లీ తల్లిగా మారింది. అమెరికాలోని నెబ్రస్కాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... 61 ఏళ్ల సెసిలె ఎలెగ్ కొడుకు మేథ్యూ ‘గే’. దీంతో.. అతను  ఇలియట్ డౌఘెర్టీ అనే మరో పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు.  కాగా.. వీరిద్దరూ తమకు  సంతానం కావాలని భావించారు. కానీ అది సాధ్యం కాదని వాళ్లకూ తెలుసు.

Latest Videos

ఇదే విషయాన్ని మెథ్యూ తన తల్లితో చెప్పాడు. దీంతో వారు వెంటనే వైద్యులను సంప్రదించారు. ‘గే’ జంట పిల్లలను కనడం అసాధ్యమని చెప్పడంతో ఆమె తల్లి సరోగసీ విధానంలో బిడ్డను కనేందుకు ముందుకొచ్చింది. అయితే, అప్పటికే ఆమెకు 61 ఏళ్లు నిండాయి. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది సాధ్యమేనని చెప్పారు. 

మెథ్యూ నుంచి స్పెర్మ్‌ను, అతని భర్త ఇలియట్ సోదరి నుంచి అండాన్ని సేకరించిన వైద్యులు సెసిలె గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల తర్వాత ఆమె ఒమాహాలోని నెబ్రస్కా మెడికల్ సెంటర్‌లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి ఉమా అని పేరు పెట్టారు. ఒక మహిళ సరోగసి విధానంలో మనవరాలికి (లీగల్‌గా కొడుకు బిడ్డ) జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 

click me!