Mosquito Repellent: ఈ సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేయొచ్చు!

Published : Mar 17, 2026, 03:21 PM IST
Dengue Mosquito

సారాంశం

వేసవికాలం వచ్చిందంటే చాలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. పగలు, రాత్రి తేడా లేకుండా కుడుతుంటాయి. దానివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ దోమలను ఈజీగా ఇంట్లో నుంచి తరిమి కొట్టాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. 

Natural Mosquito Repellent: పబ్లిక్ ప్రదేశాల్లోనే కాదు, ఇంట్లోకి కూడా దోమలు ఈజీగా వచ్చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి దూరిపోతాయి. ఇవి మనల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రమాదకరమైన జబ్బులను కూడా వ్యాపింపజేస్తాయి.

దోమలను తరిమికొట్టడానికి మార్కెట్లో చాలా రకాల స్ప్రేలు దొరుకుతాయి. కానీ రోజూ వాటిని వాడటం మంచిది కాదు. ఈ స్ప్రేలలో ఉండే కెమికల్స్ వల్ల పిల్లలకే కాదు, పెద్దల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అందుకే, కెమికల్ స్ప్రేలకు బదులుగా ఇంట్లో దొరికే పదార్థాలతో దోమలను తరిమికొట్టడం ఉత్తమం.

దోమలను తరిమికొట్టే చిట్కాలు

కర్పూరం

దోమలను తరిమికొట్టడంలో కర్పూరం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఒక ప్రమిద తీసుకొని, అందులో కర్పూరం వేసి, కొద్దిగా ఆవనూనె పోసి వెలిగించాలి. ఆ పొగ ఇంటి మూలమూలలకూ వెళ్లేలా చూసుకోవాలి. కర్పూరం, ఆవనూనె వాసనను దోమలు అస్సలు తట్టుకోలేవు.

తులసి మొక్క

తులసిలో బోలెడు ఔషధ గుణాలుంటాయి. దీన్ని దోమలను తరిమికొట్టడానికి కూడా వాడొచ్చు. ఇంట్లో దోమలు ఎక్కువగా వచ్చే కిటికీల దగ్గర తులసి మొక్కను పెట్టాలి. తులసి వాసనకు దోమలు దగ్గరికి కూడా రావు, ఇంట్లోకి ప్రవేశించవు.

వెల్లుల్లి

మన వంటగదిలో ఉండే వెల్లుల్లిలో కూడా ఓ మ్యాజిక్ ఉంది. దీన్ని వంటలకే కాదు, దోమలను తరిమికొట్టడానికి కూడా వాడొచ్చు. వెల్లుల్లికి ఘాటైన వాసన ఉంటుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, నీటిలో బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, తలుపులు, కిటికీల దగ్గర స్ప్రే చేయాలి. దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

వేప ఆకులు

దోమలను తరిమికొట్టడానికి వేప ఆకుల పొగ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. వేపలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. కొన్ని వేప ఆకులను ఒక కాల్చి, ఆ పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి. వేప చేదు వాసనకు దోమలు ఇల్లు వదిలి పారిపోతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Menopause: 50 తర్వాత మహిళలు ఇవి తప్పక తినాలి, లేదంటే ఏం జరుగుతుందంటే..?
Gold Earrings: 4 గ్రాముల్లో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. ఓ లుక్కేయండి