అమ్మాయిలు ఇష్టపడాలంటే ఏం చేయాలో ఎలా వ్యవహరించాలో తెలుసా?

Published : Mar 10, 2023, 01:44 PM IST
అమ్మాయిలు ఇష్టపడాలంటే ఏం చేయాలో ఎలా వ్యవహరించాలో తెలుసా?

సారాంశం

సాధారణంగా అమ్మాయిలు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలవారు.వాళ్లు ఏ విషయాన్ని అయినా చాలా సున్నితంగా తీసుకొని చిన్న విషయానికే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు వారి మనసులో ఉన్నటువంటి భావాలను కూడా బయటకు వ్యక్తపరచలేరు.ఇలా వారి అభిప్రాయాలను తెలియ చేయకపోవడం వల్ల అసలు వారి మనసులో ఏముందనేది తెలుసుకొని వారికి అనుగుణంగా మెలగడం చాలా కష్టతరమవుతుంది.  

 ఇలా మనసులో భావాలను తెలియజేయకుండా వారిని ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయిలతో ఉన్న సమయంలో ఈ విధంగా ప్రవర్తించినప్పుడే వారు మనపై ఇష్ట తను చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు. మరి అమ్మాయిల ముందు ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి అనే విషయానికి వస్తే...

*అమ్మాయిలు ఏ పని చేసిన మనం వారిని మెచ్చుకొని వారి చేసిన పని పట్ల ప్రశంసలు కురిపిస్తే అమ్మాయిలు చాలా తొందరగా కరిగిపోతారు అలా వారిని మెచ్చుకునే వారి పట్ల అమ్మాయిలు ఇష్టం చూపుతారు.

*ఇక అమ్మాయిలు వారి జీవితం పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారిని క్రిటిసైజ్ చేయకుండా వారిని ప్రోత్సహించడం, మేమున్నాం అనే భరోసా కల్పించే వారిని అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడతారు.

*అమ్మాయిలు సాధారణంగా బయట ఫుడ్ తినడానికి బయట ఏదైనా షాపింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలా వారి ఇష్టానికి అనుగుణంగా వారికి నచ్చినవి కొన్ని పెడితే చాలు అమ్మాయిలు చాలా తృప్తి పొందుతారు అయితే వారికి నచ్చినవి కొనివ్వడం ఎంతో మంచిది.

*ఇక మన ఇంట్లో ఒక అమ్మాయిని ఇతరులతో కనక పోల్చి మాట్లాడితే అమ్మాయిలు అసలు సహించుకోరు. ఇలా పొరపాటున కూడా ఒక అమ్మాయి ముందు మరొక అమ్మాయిని గొప్పగా పొగుడుతూ మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే ఇక ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

*ఇక అమ్మాయిలతో మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఎంతో అవసరం ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న అమ్మాయిల దగ్గర అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన వాళ్లు అసలు సహించరు ఇలా మాట్లాడితే గనుక అమ్మాయిల కోపానికి బలి కావాల్సి ఉంటుంది. అందుకే అమ్మాయిల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం, మాట్లాడటం ఎంతో మంచిది.

PREV
click me!

Recommended Stories

Maharani Anklets: పాాదాలకు మహారాణి వెండి పట్టీలు.. డిజైన్లు ఇవిగో
Bitter gourd: చేదు లేకుండా కాకరకాయ కూర టేస్టీగా ఉండాలంటే వెరీ సింపుల్ టిప్స్ ఇదిగో