వధువు కావలెను: క్వాలిటీస్ లో బ్రా సైజ్ అడిగిన వరుడు.. పోస్టు వైరల్..!

By telugu news teamFirst Published Nov 23, 2021, 3:38 PM IST
Highlights

ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తనకు ఎలాంటి అమ్మాయి కావాలో.. ఆ అమ్మయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలియజేస్తూ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ప్రకటన వైరల్ గా మారింది.
 

వధువు కావాలెను, వరుడు కావలెను.. లాంటి ప్రకటనలు టీవీల్లో, పేపర్స్ లో  చాలా సార్లే చూసి ఉంటారు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే యువతీ యువకులు.. తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవారు కావాలో తెలియజేస్తూ.. ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు కొంచెం అప్ డేట్ అయ్యాం కాబట్టి.. ఆ ప్రకటనలను మ్యాట్రిమోని సైట్ లలో పెడుతున్నారు.

తాజాగా.. ఓ యువకుడు కూడా... ఇలానే పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తనకు ఎలాంటి అమ్మాయి కావాలో.. ఆ అమ్మయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలియజేస్తూ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ప్రకటన వైరల్ గా మారింది.

Liberal but pro life. Boob size. Height and other requirements of this one Indian man on a matrimonial site! pic.twitter.com/xxljeXAHsG

— Naimish Sanghvi (@ThatNaimish)

మామూలుగా అయితే.. అమ్మాయి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. హైట్ ఇంత ఉండాలి.. కలర్ అలా ఉండాలి.. ఈ నక్షత్రం అయ్యి ఉండాలి.. ఇలా రకరకాల క్వాలిటీస్ అడుగుతారు. కానీ ఓ యువకుడు వీటిని మించి.. అమ్మాయి బాడీ పార్ట్స్ సైజ్ కూడా మెన్షన్ చేయడం ఇక్కడ గమనార్హం. కాగా.. ఇప్పుడు ఈ ప్రకటనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ప్రకటన చూసిన వారంతా ఆ యువకుడిని తిట్టిపోస్తున్నారు.

మ్యాట్రిమోనియల్‌లో, వరుడు లేదా వధువు ఒక నిర్దిష్ట డిమాండ్‌ను ఉంచడం సహజం. ఉద్యోగి కావాలన్నా, కనీసం డిగ్రీ చదివినా, ఇంటికి సరిపోయేలా, తెల్లగా ఉండాలన్నా, సన్నగా ఉండాలన్నా అనేక డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి మాత్రం మరీ టూ మచ్ గా ప్రకటన ఇచ్చాడు. బ్రా సైజ్ ఇంత ఉండాలి.. నడుము ఇంత ఉండాలి అంటూ  చెప్పడం గమనార్హం.


‘నేను పెళ్లి అమ్మాయి కోసం చూస్తున్నాను. పెళ్లి చేసుకునే అమ్మాయి ఎత్తు 5.2 నుంచి 5.6 ఉండాలి. బ్రా పరిమాణం 32C , నడుము పరిమాణం 12 నుండి 16 అంగుళాలు ఉండాలి. వయస్సు 18  నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. అహంకారం వద్దు. చేతులు అందంగా ఉండాలాి. శుభ్రమైన పాదాలను కలిగి ఉండాలి. అమ్మాయిల దుస్తులు 80 శాతం క్యాజువల్‌గా ,20 శాతం ఫార్మల్‌గా ఉండాలి. పడకగదిలో కూడా కాస్ట్యూమ్స్ ధరించాలి. నమ్మకంగా ఉండాలి. నాతో కలిసి సినిమాలు, టూర్స్ రావాలి. పిల్లలు మాత్రం ఇప్పట్లో వద్దు. కుక్కలను ప్రేమించాలి.’’ అంటూ ప్రకటన ఇవ్వడం గమనార్హం.

 

కాగా.. అతని ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతని డిమాండ్స్ ని స్క్రీన్ షాట్ తీసి  సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఆయన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారరు. దానికి తోడు సెన్సార్ లేకుండా ప్రచారం చేసిన మ్యాట్రిమోనీ సైట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మ్యాట్రిమోనియల్ సైట్ ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మ్యాట్రిమోనియల్ సైట్ కూడా అతని యాడ్‌ని బ్లాక్ చేయకపోవడం గమనార్హం.

మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఈ రకమైన ప్రకటన ఇది మొదటిది కాదు. చాలా చిత్ర విచిత్రమైన ప్రకటనలు వైరల్ అవుతున్నాయి. అయితే పాదాల ఎత్తు, బరువు, నడుము, కాలు సైజు కచ్చితంగా ఒకే విధంగా ఉండాలని ప్రకటనలు ఇచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం.

click me!