Maha Shivaratri: శివ మంత్రమే 'మృత్యుంజయ' మంత్రం ఎందుకయ్యింది?.. దీన్నిఎప్పుడు జపించాలి? జపిస్తే ఏమౌతుంది?

By Mahesh Rajamoni  |  First Published Feb 24, 2022, 4:39 PM IST

Maha Shivaratri: అన్ని మంత్రాల్లో శివ మంత్రమే మృత్యుంజయ మంత్రంమైంది. ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి? జపిస్తే ఏమౌతుంది..


Maha Shivaratri: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌

ఈ మంత్రానికి అర్థం:  సకల ప్రాణులకు శక్తినిచ్చే ముక్కంటి మహాదేవుడు, సుగంధ భరితుడైన పరమేశ్వరున్ని పూజిస్తున్నాం. బాగా పండిన పండు నుంచి తొడిమను పండును వేరుచేసినట్టుగానే మమ్మల్ని కూడా ఆ పరమేశ్వరుడు మృత్యువు నుంచి విడిపిస్తాడని భావం.

Latest Videos

undefined

మరణాన్ని జయించడమంటే కొన్ని వేల ఏండ్ల పాట్లు ఈ భూమిపై శరీరం పతనం కాకుండా జీవించడం కానే కాదు. మృత్యువును జయించడమంటే పునర్జన్మ లేకపోవడమని అర్థం. అంటే ఈ భూమిపై ఒక జన్మ తర్వాత మళ్లీ మళ్లీ పుట్టడం, చనిపోవడాలు లేకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ జన్మలోనే పూర్తి ముక్తిని పొందడమని అర్థం. 

మరి ముక్తి అంటే ఏమిటి? ముక్తి చావు తర్వాత పొందేది కానే కాదు. ఇది మనం జీవించి ఉండగానే పొందేది. ఈ ముక్తిని పొందడం అంత సులువు కాదు. జ్ఞాని మాత్రమే ముక్తి పొందుతాడు. మరి ఒక వ్యక్తి జ్ఞాని కావాలంటే ఈ మంత్రాన్ని జపించాల్సిందే. అదేలా జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బాగా పండిన దోసపండు దానంతటదే తొడిమ నుంచి వేరు పడుతుంది. అలాగే జ్ఞాని అయిన వ్యక్తులు కూడా ఈ దోసపండు (ఊర్వారుక) లాగే ప్రాపంచికత నుంచి బయటపడతాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ మనిషి చుట్టూ ఉన్న మాయా ప్రపంచం నుంచి బయటపడతాడని అర్థం. 

పూర్తిగా పండిన దోసపండు దానంతట అదే తొడిమ నుంచి వేరుపడుతుంది. ఇక ఆ పండు తొడిమతో సంబంధమనేదే లేకుండా తొడిమతోనే ఎలా అయితే ఉంటాడో.. అలాగే జ్ఞానం పొందిన వ్యక్తి కూడా సంసారమనే మాయాజాలం నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడు. అంటే ప్రాపంచిక బంధాల నుంచి విడిపోతాడన్న మాట. కానీ దేహం మరణించేంత వరకు కుటుంబంతోనే కలిసి ఉంటాదు. అంటే ఆ వ్యక్తి ఈ ప్రపంచంలోని పుట్టుక, మరణం లేని స్థితిలో ఉంటాడని అర్థం.

ఈ మంత్రం ఎప్పుడు జపించాలి : ఈ మంత్రాన్ని రెండు పద్దతుల ద్వారా జపించొచ్చు. ఈ మంత్రాన్ని ఒక వ్యక్తి 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పగలు రాత్రం అంటూ తేడా లేకుండా ఎప్పుడైనా జపించొచ్చు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఏకగ్రత పెరుగుతుంది. అలాగే నిద్రకూడా బాగా పడుతుంది. ఈ మంత్రాన్ని జీవితంలో ఖష్టాలన్నీ తొలగిపోయి.. ప్రశాంతంగా ఉండేందుకు జపించాలి.

మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల భయం పోతుంది. మీరు కష్టకాలంలో ఉన్నా.. మీకు ధైర్యాన్ని ప్రసాదించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైనదో.. ఈ మృత్యుంజయ మంత్రం కూడా అంతే పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. రుద్రుడు క్షీర సాగర మథనంలో వచ్చిన హాలాహాలన్ని తాగిన తర్వాత మృత్యుంజయుడు అయ్యాడట. కాగా ఈ మంత్రాన్ని జపించిన వారికి రుద్రుని క్రుప కలిగి మృత్యుంజయులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. మీకు ఆపద కలిగినప్పుడు, భయం వేసినప్పుడు ఈ మంత్రాన్ని చదివితే.. ఎలాంటి భయాలు మిమ్మల్ని చుట్టుముట్టవు. 

 

click me!