తరచూ శృంగారం.. బరువు పెరగడానికి కారణమా?

By telugu teamFirst Published Jun 10, 2019, 3:00 PM IST
Highlights

పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిలు ఉన్నపళంగా బరువు పెరుగుతూ ఉంటారు.  ఇలా బరువు పెరగడానికి శృంగారంతో సంబంధం ఉందని ఓ పరిశోధనలో తేలితే...  దానికీ, దీనికి ఎలాంటి సంబంధం లేదని మరో పరిశోధననలో తేలింది.

పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిలు ఉన్నపళంగా బరువు పెరుగుతూ ఉంటారు.  ఇలా బరువు పెరగడానికి శృంగారంతో సంబంధం ఉందని ఓ పరిశోధనలో తేలితే...  దానికీ, దీనికి ఎలాంటి సంబంధం లేదని మరో పరిశోధననలో తేలింది.

ఓ పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం... అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందట. అందుకే అనూహ్యంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు.

శారీరిక కలయిక కారణంగా అమ్మాయిల నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరగుతారని వారు చెబుతున్నారు. అయితే అదొక్కటే కారణం కాదట. అప్పటి వరకు పుట్టినింట్లో తినే తిండికి, అత్తారింటిలో తినే తిండికి చాలా మార్పులు ఉంటే కూడా ఇలా శరీరంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. 

పెళ్లి జరిగింది అంటే.. అమ్మాయిల్లో రెస్పాన్సిబులిటీస్ కూడా పెరిగిపోతాయి. ఇంట్లో సభ్యులు అందరూ తిన్న తర్వాత మాత్రమే తినాలి, సరైన నిద్ర లేకపోవడం, పిల్లలు పుట్టడం, ఆలోచనలు ఎక్కువవడం, ఒత్తిడి లాంటివి కూడా శరీర బరువు పెరగడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు.

మరో పరిశోధనలో మాత్రం.. దీనికి భిన్నమైన వాదన వినపడుతోంది. వివాహం తర్వాత మహిళలు లావు అయితే కావొచ్చు కానీ, అలా బరువు పెరగడానికీ సెక్స్ కూ ఎలాంటి సంబంధం లేదని వీరు చెబుతున్నారు.  తీసుకునే ఆహారం, మానసిక ఆందోళనలు తగ్గడం.. శారీరక శ్రమ తగ్గడం.. వంటి కారణాల వల్ల పెళ్లి తర్వాత చాలా మంది లావవుతూ ఉంటారు. అంతే కానీ.. సెక్స్ కూ బరువు పెరగడానికి సంబంధం లేదు. పురుషుడి వీర్యం మహిళలో చేరడం వల్ల బరువు పెరిగే అవకాశాలేమీ ఉండవు... అని వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

click me!