హస్త ప్రయోగంతో వర్జినిటీ కోల్పోతారా..?

By telugu teamFirst Published Jun 7, 2019, 4:01 PM IST
Highlights

అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. 

అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. 

దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా..  కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే..  అదంతా వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.

హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.

అయితే... చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని నమ్ముతుంటారు. అయితే.. అది కూడా వట్టి అపోహ అని తేలిపోయింది. కేవలం స్త్రీ అంగంలోని పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారని.. అలా జరగన్పుడు.. వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని చెబుతున్నారు.

అయితే... చాలాల మంది యువతులకు చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడటం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసేవారికి మాత్రం కన్నెపొర చిరిగిపోతుంది. అంతే తప్ప వారి వర్జినిటీ మాత్రం అలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

click me!