రోజు రెండుకి మించి గుడ్లు... గుండెకి ముప్పు

By telugu teamFirst Published Jun 7, 2019, 3:41 PM IST
Highlights

ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.  ఎందుకంటే... గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాహారాలని అందించడంలో కోడి గుడ్డు ముందు ఉంటుంది.

ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.  ఎందుకంటే... గుడ్డులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాహారాలని అందించడంలో కోడి గుడ్డు ముందు ఉంటుంది. అందుకే శాకాహారులను కూడా కోడి గుడ్డు తీసుకోవాలని వైద్యులు  చెబుతుంటారు. ఈ మంచి అతి అయితే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

రోజుకి ఎక్కువలో ఎక్కువ రెండు కోడి గుడ్లు తినవచ్చట. అంతకు మించి తింటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది. అమెరికా వ్యవసాయశాఖ వెల్లడించిన ఈ వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు. 

31ఏళ్లుగా దాదాపు 30వేల మంది తీసుకుంటున్న ఆహారం, వారి జీవన విధానంపై పరిశోధన చేసినట్లు తెలిపారు. కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మస్సాచుసెట్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేథరినా టక్కర్‌ పేర్కొన్నారు. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములు దాటితే గుండెజబ్బులు రావడానికి 17% ఆస్కారం ఉందని, చనిపోయేందుకు కూడా 18% అవకాశం ఉందని వెల్లడించారు.

click me!