Cancer Symptom: కాలులో క్యాన్సర్ లక్షణాలు..

By Mahesh RajamoniFirst Published May 23, 2022, 9:57 AM IST
Highlights

Cancer Symptom: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల నేడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

Cancer Symptom: క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఇది అనేక విధాలుగా సోకుతుంది. రోగాన్ని బట్టి ఇది వివిధ అవయవాలపై ఎఫెక్ట్ చూపుతుంది. అలాగే.. క్యాన్సర్ లక్షణాల తీవ్రత కూడా భిన్నంగా ఉంటుంది.

ఈ రోజుల్లో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల నేడు ఎంతో మంది చనిపోతున్నారు. 

కాకపోతే నేడు చాలా రకాల క్యాన్సర్లకు సమర్థవంతంగా చికిత్స చేయబడుతోంది. దీని కోసం రోగనిర్ధారణను సకాలంలో గుర్తించగలగాలి. లక్షణాలు కనిపించి, పరీక్ష చేసినప్పుడు మాత్రమే అది ఏ రకమైన క్యాన్సరో నిర్ధారణ అవుతుంది. 

అయితే క్యాన్సర్ లక్షణాలు కాలులో కూడా కనిపిస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. నరాలు బాహ్యంగా కనిపించే విధంగా కొందరి కాళ్లు ఉంటాయి. అది నీలం, ఎరుపు రంగులో ఉండవచ్చు. అంటే నరాలు వేర్లు లేదా కొమ్మల వలె వ్యాపించి ఉంటాయి.

అంటే ఆ ప్లేస్ లో అక్కడక్కడా రక్తం గడ్డకడుతుంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా 'డీప్ సిర త్రాంబోసిస్' అని పిలుస్తారు. కేవలం ఒక కాలులోనే వాపు మరియు నొప్పి కలుగుతుంది.  అరుదుగా మాత్రమే రెండు కాళ్లలో వాపు మరియు నొప్పి ఉంటాయి. అలాగే ప్రభావిత ప్రాంతంలో చర్మం ఎరుపు మరియు సన్నగా ఉండటం, నరాలు బయటకు స్పష్టంగా కనిపించడం, దానిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇది క్లోమగ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్ కు సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు. క్లోమం అనేది కడుపు యొక్క అడుగు భాగంలో కనిపించే ఒక అవయవం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

కానీ ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు సంకేతం కాకపోవచ్చు. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో సహా కొన్ని క్యాన్సర్ రోగుల రక్తం గడ్డకట్టడాన్ని అభివృద్ధి చేయవచ్చు. వీటిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదటిది. 

కామెర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క మరొక ప్రధాన లక్షణం. మూత్రం ముదురు రంగులో రావడం, మలం లేత రంగు మరియు జిడ్డుగా ఉండటం, చర్మంపై ఎప్పుడూ దురద పెట్టడం వంటివి లక్షణాలు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను సూచిస్తాయి. కొంతమందిలో వికారం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.  క్లోమంపై ప్రభావం చూపడం వల్ల మధుమేహానికి కూడా దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే మీరు తరచుగా మూత్రవిసర్జన చేయాలని అనిపించడం, తరచుగా దాహంగా అనిపిస్తుంది. 

click me!