దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. మందులతో పుట్టబోయే బిడ్డ జెండర్ ని మార్చలేమని సూచిస్తున్నారు. కేవలం గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని..కేవలం ఆడపిల్లే పుట్టాలి లేదా మగబిడ్డే పుట్టడం అనేది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదని చెబుతున్నారు.
ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావించేవారు. చదువులు చెప్పించాలి.. పెళ్లి చేసి పంపించాలి.. భారీగా కట్నం ఇవ్వాలంటూ... ఆడపిల్ల పుడితే కంగారు పడేవారు. ఒకానొక సమయంలో కడుపులోనే ఆడపిల్లలను చిదిమేసిన వాళ్లు ఉన్నారు. అదే మగపిల్లవాడు అయితే... తమను ఉద్దరిస్తాడనే భావన చాలా మందిలో ఉండేది. కాలం మారింది.. ఇప్పుడు మనుషులు వారి ఆలోచనా విధానం కూడా మారింది. ఆడ, మగ ఇద్దరూ ఒకటే అనే భావన జనాల్లో పెరిగింది.
అయితే... ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికే ఆడపిల్ల పుడితే... రోడ్డు మీద, చెత్త కుప్పలో వదిలేయడం లాంటివి చేస్తున్నవారు ఉన్నారు. ఆడపిల్ల వద్దు మగపిల్లవాడు కావాలని కోరుకునేవారు కూడా కొందరు ఉన్నారు. ఇందులో భాగంగానే.. కొన్ని రకాల మందులు వాడితే కచ్చితంగా మగపిల్లలు పుడతారని నమ్మేవారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
అయితే... దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. మందులతో పుట్టబోయే బిడ్డ జెండర్ ని మార్చలేమని సూచిస్తున్నారు. కేవలం గర్భం దాల్చడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని..కేవలం ఆడపిల్లే పుట్టాలి లేదా మగబిడ్డే పుట్టడం అనేది మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదని చెబుతున్నారు. సైన్స్ ప్రకారం.... ఎక్స్ క్రోమోజోమ్, వైక్రోమోజోమ్.. ఈ రెండు కలిస్తే ఆడపిల్లలు పుడతారు. అదే రెండు వై క్రోమోజోములు కలిస్తే... మగ పిల్లలు పుడతారు.
స్త్రీల నుంచి ఎప్పుడూ వై క్రోమో జోమ్ మాత్రమే వెలువడుతుంది. పురుషుల నుంచి వచ్చే క్రోమోజోమ్ ని బట్టే పుట్టేది ఆడో, మగో తేలుతుంది. అయితే... పురుషుల్లో వై క్రోమోజోమ్ ని పెంచే మందులు వాడితే... కచ్చితంగా మగపిల్లాడు పుడతాడు అనుకోవడం పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి మందులు కూడా ఏమీ ఉండవని వారు చెబుతున్నారు.ఇలాంటి మందులు ఉంటాయని ఎవరైనా చెప్పినా.. నమ్మి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.