ఇక్కడ హోలీ రంగులతో కాదు... బూడిదతో చేసుకుంటారు...!

By telugu news team  |  First Published Mar 3, 2023, 1:16 PM IST

అసలు రంగులు కాకుండా.. బూడిదతో హోలీ చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. బనారస్ అనే ప్రాంతంలో హోలీని రంగులతో కాదు.. బూడిదతో జరుపుకుంటారు.



హోలీ పండగ అనగానే ఎవరికైనా ఏం గుర్తుకు వస్తుంది..? రంగు రంగుల పండగ. ఒకరికి మరొకరు రంగులను పూసుకుంటారు. ఈ హోలీలో మనం అన్ని రకాల రంగులను వాడతాం. ఎక్కువగా ముదురు రంగులను వాడటానికి ఇష్టపడతాం. అయితే...అసలు రంగులు కాకుండా.. బూడిదతో హోలీ చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. బనారస్ అనే ప్రాంతంలో హోలీని రంగులతో కాదు.. బూడిదతో జరుపుకుంటారు.

నమ్మసక్యంగా లేదు కదా. కానీ ఇదే నిజం.బనారస్‌లో ఈ హోలీని మసాన్ కి హోలీ , స్మశాన హోలీ అని పిలుస్తారు. ఎవరు ఈ హోలీ ఆడతారు? ఈ పండుగను ఏ రోజు జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

Latest Videos

బాబా విశ్వనాథ్ హోలీ ...
ఇక్కడ రెండు రోజుల పాటు హోలీ ఆడతారు. రంగాభరి ఏకాదశి నాడు, బాబా విశ్వనాథ్ తన నగరంలోని భక్తులతో కలిసి అబీర్ హోలీ ఆడుతారని నమ్ముతారు. మరుసటి రోజు మణికర్ణికా ఘాట్ వద్ద బాబా తన గణాలతో చితా భస్మ హోలీ ఆడుతారని నమ్ముతారు.

బాబా విశ్వనాథ్ మధ్యాహ్న సమయంలో హోలీ ఆడతారు..
బాబా విశ్వనాథ్ అంటే శివుడు అని అర్థం. ఆయన  మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్ వద్ద స్నానం చేయడానికి వస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సమయంలో ఈ హోలీని ఆడతారు. చాలా సంవత్సరాల నుండి ఈ సంప్రదాయాన్ని పూర్తి  విశ్వాసంగా, ఉత్సాహంతో ,ఉల్లాసంగా జరుపుకుంటారు.

ఈ హోలీ ఎలా ఆడాలి?
సంప్రదాయం ప్రకారం, సంసనానాథుని విగ్రహంపై మొదట గులాల్ , చితా భస్మాన్ని ఉంచిన తర్వాత.. ఈ బూడిదతో హోలీ జరుపుకుంటారు. ఈ బూడిదతో హోలీ ఆడటం వల్ల   రాక్షసులు, పిశాచాల నుంచి రక్షణ లభిస్తుందని... ఆ పరమ శివుడు కాపాడతాడని అక్కడివారు నమ్ముతుంటారు.


వివిధ రకాల రంగులను వదిలి చితా భస్మముతో జరుపుకునే ఈ సాంప్రదాయ పండుగ హోలీని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. మీరు వెళ్లాలనుకుంటే, మీరు రణబరి ఏకాదశికి బనారస్ వెళ్ళవచ్చు.

click me!