కూలర్ వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 5, 2024, 2:24 PM IST

ఎయిర్ కూలర్ ను రెగ్యులర్ గా వాడుతుంటే.. కొన్ని రోజుల తర్వాత దాని నుంచి ఒక రకమైన వాసన రావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల కూలర్ ను వాడాలని కూడా అనిపించదు. అసలు ఈ వాసన ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 


ఎండవేడిని తట్టుకోవడానికి .. ఇంటిని చల్లగా ఉంచడానికి కూలర్లను వాడుతుంటాం. ఏసీల కంటే కూరల్లే చాలా తక్కువ ధరకు వస్తాయి. అందులోనూ వీటిని ఎక్కడంటే అక్కడ పెట్టొచ్చు. అయితే కూలర్ల నుంచి కొన్ని రోజుల తర్వాత ఒకరకమైన దుర్వాసన రావడం మొదలవుతుంది. అసలు కూలర్ నుంచి ఇలా వాసన ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా పోగొట్టాలో చాలా మందికి తెలియదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు కూలర్ నుంచి తాజా వాసన వచ్చేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఓ లుక్కేద్దాం పదండి.

శుభ్రత: కూలర్ నుంచి దుర్వాసన రావడానికి దుమ్ము, ధూళే కారణం. అందుకే వీటిని తొలగించడానికి కూలర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. కూలర్ నుంచి వాసన రాకూడదంటే క్రమం తప్పకుండా వాటర్ ట్యాంకును ఖాళీ చేయండి. అలాగే శుభ్రం చేయండి. అలాగే కూలర్ లోపలి భాగాన్ని శానిటైజ్ చేయండి. అలాగే అవసరమైన విధంగా కూలింగ్ ప్యాడ్ లను కూడా మార్చుతూ లేదా శుభ్రం చేస్తూ ఉండండి. 

Latest Videos

తగినంత గాలి: కూలర్ కు గాలి బాగా తగలాలి. అప్పుడే కూలర్ నుంచి ఫ్రెష్ గాలి వస్తుంది. అందుకే స్తంభించిన గాలిని నివారించడానికి, వాసన వచ్చే అవకాశాలను తగ్గించడానికి మీ కూలర్ ను బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో పెట్టండి. కిటికి తెరిచి అక్కడ కూలర్ ను పెట్టొచ్చు.

శుభ్రమైన నీరు: దుర్వాసన వాసనలకు కారణమయ్యే బ్యాక్టీరియా, మలినాలు కూలర్ లోపలికి వెళ్లకుండా ఉండటానికి మీ కూలర్ కోసం ఫిల్టర్ చేసిన, శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అలాగే కూలర్ ను వాడిన తర్వాత నీటి ట్యాంకును రెగ్యులర్ గా ఖాళీ చేయాలి. అవసరమైనప్పుడు రీఫిల్ చేయండి. కూలర్ లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దానిలోంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది.

నేచురల్ డియోడరైజర్లు: వాసనను తగ్గించడానికి, బ్యాక్టీరియా పెరుగుదలను ఆపటానికి  వాటర్ రిజర్వాయర్లోకి వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం వంటి సహజ డియోడరైజింగ్ ఏజెంట్లను వేయండి. దీన్ని ఉపయోగించే ప్రతి సారి నీటిలో కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసాన్ని మర్చిపోకుండా కలపండి. 

క్లీనింగ్ తర్వాత ఆరబెట్టడం: కూలర్ ను క్లీన్ చేసిన లేదా వాటర్ రీఫిల్ తర్వాత తేమ ఉండకుండా కూలర్ అన్ని ఉపరితలాలను పూర్తిగా ఆరబెట్టాలి. తేమతో కూడిన వాతావరణం అచ్చు, బూజు పెరిగేలా చేస్తుంది. ఇది కూలర్ నుంచి దుర్వాసన వచ్చేలా చేస్తుంది. అందుకే కూలర్ ను శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా బయటి, లోపలి భాగాలను ఆరబెట్టండి. 

click me!