ఒత్తిడితో సతమతమౌతున్నారా..? ఇలా చేసి చూడండి

By telugu teamFirst Published Sep 13, 2019, 4:32 PM IST
Highlights

ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.
 

మనం ఎంత ఒత్తిడి తీసుకోకూడదు... ప్రశాంతంగా ఉండాలని భావించినా... పనిలో ఒత్తిడి సర్వసాధారణం. కానీ ఆ ప్రభావం మనపై ఎక్కువగా చూపిస్తేనే అసలు సమస్య మౌదలౌతుంది. మరి ఒత్తిడి ఉన్నా... ఆ ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడాలి అంటున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందామా..

మీరు పని చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల చెత్త, పనికిరాని కాగితాలు, అవసరం లేని వస్తువులు ఇలా ఏమి ఉన్నా వాటిని అక్కడి నుంచి తీసేయాలి. ఒక్కసారి అలా చేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది.

ఆఫీసుకు వెళ్లిన తర్వాత పని ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి..? ఏం చేయాలని అని కంగారు పడే బదులు.. ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి కొంత వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి.

ఒక్కోరోజు.. రోజంతా కష్టపడినా చేయాల్సిన పని పూర్తి కాదు. దీంతో ఆ పని పూర్తి చేయాలని కదలకుండా కుర్చుండిపోతాం. దాని వల్ల కూడా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పనిచేసే స్థలం నుంచి ప్రతి గంట లేదా రెండు గంటలకు ఒకసారి విరామం తీసుకోవాలి.  తర్వాత ఓ పది నిమిషాలు ఆగి మళ్లీ పని మొదలుపెట్టడం మంచిది.

ఆఫీసు టేబుల్ దగ్గర మీకు నచ్చిన ఫోటోలు, కుటుంబసభ్యుల ఫోటోలు పెట్టుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆ ఫోటోలు చూస్తే... కాస్త రిలీఫ్ దొరుకుతంది. మరీ ఎక్కువ ఒత్తిడి అనిపించినప్పుడు పని చేయవద్దు. ఆ సమయంలో చేస్తే... ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ ఆ పనిని చేయాల్సి ఉంటుంది.  దానికి బదులు కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత పని మొదలుపెట్టడం మంచిది.

click me!