చిన్న పిల్లల్లో హై బీపీ.. కారణమేంటో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Sep 17, 2022, 3:57 PM IST
Highlights

ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన కొన్ని వ్యాధులు నేడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హైబీపీ, షుగర్ లాంటి వ్యాధులు చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. అందులో హైబీపీ వల్ల పిల్లలు ఎన్నో ఇతర సమస్యలను ఫేస్ చేస్తున్నారు. 
 

అధిక రక్తపోటు ఒకప్పుడు పెద్దవారిలోనే కనిపించేది.  50 ఏండ్ల వయసు దాటిన వారే దీనిబారిన పడతారని ప్రజలు నమ్మే వారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు సైతం ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. అయితే పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బీపీ లక్షణాలు కనిపించవు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు హైబీపీ  బారిన పడ్డారని  గుర్తించలేకపోతున్నారు. పిల్లల్లో అధిక రక్తపోటు సమస్యకు చెడు జీవనశైలితో పాటు అసమతుల్యమైన ఆహారమే ప్రధాన కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయితే కొంతమంది పిల్లలు జన్యుపరమైన కారణాల వల్ల బిపితో బాధపడుతున్నారు. పిల్లల్లో హై బీపీ లక్షణాలేంటో తెలుసుకుందాం పండి. 

పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ఈ రోజుల్లో పిల్లల్లో హై బీపీ సర్వ సాధారణ సమస్యగా మారింది. ఒక నివేదిక ప్రకారం.. అధిక రక్తపోటు ఉన్న పిల్లలో లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. సమస్య పెరిగినప్పుడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి నలుగురు పిల్లల్లో ఇద్దరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలు తరచుగా మగతగా ఉండటం, తలనొప్పి, అలసటను వంటి బీసీ లక్షణాలని గుర్తించాలి. వీటికి తోడు బీపీ సమస్య పెరిగే కొద్దీ పిల్లల్లో మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. 

పిల్లల్లో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. బీపీ పెరిగే కొద్దీ పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది కూడా. ఛాతిలో నొప్పితో పాటుగా బిగబట్టినట్టుగా ఉంటడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ కారణంగా పిల్లలకు ఎప్పుడూ కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా కోపంతో ఊడిపోతూనే ఉంటారు. ఈ అధిక రక్తపోటు పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా హైబీపీ ఉన్న పిల్లలు బరువు బాగా పెరుగుతారు.

పిల్లల్లో అధిక రక్తపోటుకు కారణం 

పిల్లల్లో హైబీపీ సమస్యకు జన్యుపరమైన కారణాలున్నాయి. అంతేకాదు హార్మోన్లలో మార్పులు, గుండె సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్ల పిల్లల్లో హైబీపీ సమస్య వస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పేలవమైన జీవనశైలి, చెడు ఆహారం కూడా పిల్లల్లో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.

పిల్లల్లో అధిక రక్తపోటును ఎలా నివారించాలి

 మీ పిల్లలు అధిక రక్తపోటు బారిన పడకూడదంటే.. పిల్లల జీవన శైలి మెరుగ్గా ఉండాలి. అంటే మీ పిల్లలకు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్ పుడ్ ను పెట్టకూడదు. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే  పెట్టాలి. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే పండ్లు, కూరగాయలను ఎక్కువగా పెట్టాలి. పిల్లలు బహిరంగా ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. అలాగే వ్యాయామం, యోగా లాంటివి చేసేలా చూడండి. ఇవి మీ పిల్లల్ని ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. 

తల్లిదండ్రులకు ఇప్పటికే హై బీపీ ఉంటే.. మీ పిల్లలకు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు బీపీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స అందించాలి. 
 

click me!