నగ్నంగా పడుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

Published : Mar 09, 2023, 10:36 AM IST
 నగ్నంగా పడుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

సారాంశం

హాయిగా నిద్రపట్టడానికి చాలా మంది నైట్ టైం వదులుగా ఉండే వాటిని వేసుకుని పడుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొత్తమే బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?    

టైట్ గా ఉండే బట్టలతోనే ప్రశాంతంగా నిద్రపోవడం చాలా కష్టం. టైట్ డ్రెస్సులు రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తాయి. శరీరానికి గాలిని తగలనీయవు. దీనివల్ల నిద్రపట్టడం చాలా కష్టం. అందుకే చాలా మంది పడుకునేటప్పుడు వదులుగా ఉండే నైట్ డ్రెస్సులను వేసుకుని పడుకుంటారు. కానీ మొత్తమే బట్టలు లేకుండా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

నగ్నంగా  నిద్రపోవడమేంటనీ చాలా మంది అనుకుంటారు. కానీ దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ను పొందుతాం. ముఖ్యంగా  భాగస్వామితో నగ్నంగా పడుకోవడం వల్ల మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది. అసలు బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

నగ్నంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి మీ భాగస్వామితో నగ్నంగా నిద్రపోతే స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ మీలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెంచుతుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు నగ్నంగా ఒంటిరిగా పడుకుంటే మీరు హాయిగా నిద్రపోతారు. చల్లని శరీర ఉష్ణోగ్రత మీ నిద్రనాణ్యతను పెంచుతుంది. దీంతో మీ ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. 

బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది

పేలవమైన నిద్ర నాణ్యత కూడా బరువు పెరిగేలా చేస్తుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. నగ్నంగా నిద్రపోవడం వల్ల మీరు హాయిగా పడుకుంటారు. ఇది మీరు అనవసరంగా బరువు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాదు ఇది మీ శరీరాన్ని బాగా చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది బ్రౌన్ ఫ్యాట్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఊబకాయం, డయాబెటీస్ వంటి  వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. నిద్రలేమి గుండె జబ్బులు, డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. నగ్నంగా పడుకుంటే మీరు రాత్రిళ్లు ఏడు నుంచి 9 గంటలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇది గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

యోని ఆరోగ్యంగా ఉంటుంది

బిగుతుగా లేదా చెమటను పట్టించే లోదుస్తులు యోని ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా రోజంతా వేసుకున్న అదే లోదుస్తులతో నిద్రపోతే. నగ్నంగా నిద్రపోవడం వల్ల మీ యోనికి గాలి చేరుతుంది. ఇది మీ యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పురుష సంతానోత్పత్తిని పెంచుతుంది

పురుషులు నగ్నంగా పడుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 656 మంది పురుషులపై ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించడం, తక్కువ స్పెర్మ్ కౌంట్ మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. బిగుతైన లోధుస్తులను వేసుకున్న వారి కంటే బాక్సర్లు ధరించిన పురుషులే ఎక్కువ స్పెర్మ్ కౌంట్, నాణ్యత గల స్పెర్మ్ ను కలిగున్నారు. నగ్నంగా నిద్రపోవడం వల్ల వృషణాలను చల్లగా, స్పెర్మ్ ఆరోగ్యానికి సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి సహాయపడుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏ రంగు డ్రెస్‌కు ఏది సెట్ అవుతుంది? ఈ 5 ఏఐ టూల్స్ వాడితే మీరే ఫ్యాషన్ ఐకాన్ !
Fan Tricks: ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందా? ఇదొక్కటి చేస్తే... ఏసీ ని మించిన చలి..!