
స్నేహితులతో కలిసి మద్యం సేవించి బయటకు వెళ్లాలంటే నోటి దుర్వాసన కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా నోటి దుర్వాసనతో నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతూ సతమతమయ్యేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడంతో మీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అని విషయానికి వస్తే...
స్నేహితులతో కలిసి పార్టీలో మందు తాగిన తర్వాత నోటి నుంచి ఆ దుర్వాసన రాకుండా ఉండాలి అంటే ఒక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగటం వల్ల నోటి నుంచి మద్యం వాసన అసలు రాదు. బ్లాక్ కాఫీ రుచి చాలా స్ట్రాంగ్ గా ఉండటంవల్ల నోటి నుంచి మద్యం తాగిన వాసన అసలు రాదు. మద్యం సేవించిన తర్వాత నోరు మొత్తం వాసన రాకూడదు అంటే వెంటనే మౌత్ వాష్ ద్వారా నోరు పుక్కలించడం ఎంతో మంచిది.
ఇలా మౌత్ వాష్ ద్వారా నోటిని పుక్కిలించడం వల్ల మద్యం తాగిన వాసన రాకుండా ఉండడమే కాకుండా నోటిలో పెరిగినటువంటి బ్యాక్టీరియాలనుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు తద్వారా నోరు దుర్వాసన కూడా రాదు. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మౌత్ వాష్ పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసనకి చెక్ పెట్టవచ్చు. అలాగే మద్యం తాగినప్పుడు మౌత్ వాష్ తో పుక్కిలించడం వల్ల మద్యం తాగిన వాసన అసలు రాదు.
ఇక చాలామంది మద్యం తాగిన తర్వాత దుర్వాసన రాకుండా ఉండడం కోసం సలాడ్ తో కలిపి వెల్లుల్లి ఉల్లిపాయ కనక తీసుకుంటే నోటి దుర్వాసనను అణిచివేస్తుంది.అయితే బయటకు వెళ్లే ముందు ఇలా వెల్లుల్లి ఉల్లిపాయను కనుక తీసుకొని వెళ్తే ఇది కూడా ఘాటు వాసన కలిగి ఉంటుంది కనుక ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలను తీసుకున్న బయటకు వెళ్లేటప్పుడు మాత్రం మౌత్ వాష్ ఉపయోగించడం ద్వారా మన నోటి నుంచి మద్యం వాసన రాకుండా ఉంటుంది. ఈ చిట్కాలు కనుక పాటిస్తే అసలు మీరు మద్యం సేవించారని ఎవరూ కూడా గుర్తించరు.