Hair Care: జుట్టు తెల్లబడటానికి అసలు కారణాలను వెల్లడించిన పరిశోధకులు..

Published : Feb 04, 2022, 12:07 PM IST
Hair Care: జుట్టు తెల్లబడటానికి అసలు కారణాలను వెల్లడించిన పరిశోధకులు..

సారాంశం

  Hair Care: సాధారణంగా వయస్సు మీద పడుతున్న వారికే జుట్టు నెరసిపోతుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులో ఉన్న వారి నల్ల జుట్టు కాస్త తెల్లజుట్టుగా మారిపోతోంది. దీనికి అసలు కారణాలను వెళ్లడించారు శాస్త్రవేత్తలు.

Hair Care: సాధారణంగా వయసు మీద పడిన వారికే జుట్టు తెల్లబడుతుందని మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం యుక్త వయస్కుల వారి నల్ల జుట్టు కూడా తెలుపు రంగులోకి వస్తోంది. అంతేకాదు కొంత మంది చిన్నపిల్లలకు కూడా జుట్టు నెరసిపోవడం మనం చూస్తున్నదే. అయితే ఈ పిల్లలకు కూడా జుట్టు ఎందుకు నెరసిపోతోందనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అందులో వారు పలు కీలక విషయాలను వెళ్లడించారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

According to the Science Focus report ప్రకారం..  జుట్టు నల్లగా ఉండటానికి అసలు కారణం మన శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యమే. ఇది పుష్కలంగా ఉంటేనే మన హెయిర్ నల్లగా ఉంటుంది. అదే ఈ మెలనిన్ లోపించినప్పుడు మన జుట్టు తెల్లగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాగా ఈ సమస్య కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఉంటుందని పరిశోధన తేల్చి చెబుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే.. జుట్టు నలుపు రంగులో ఉండటానికి మెలనోసైట్స్ కణాలు బాగా ఉపయోగపడగాయి. ఇవి జుట్టు మూలభాగాల్లో ఉంటాయి. కాగా ఈ కణాలు మెలనిన్ ను ఉత్పత్తి చేసి.. జుట్టు నల్లగా ఉండేలా చేస్తాయి. అయితే వయసు మీద పడుతున్న వారిలో ఈ కణాలు బలహీనంగా మారుతుంటాయి. అందుకే వారిలో మెలనిన్ ఉత్పత్తి క్రమ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఫలితంగా వారి హెయిర్ తెల్లగా మారుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణంగానే పెద్దలు, మధ్య మయస్కులు, యుక్త వయస్కులు, చిన్న పిల్లల జుట్టు తెల్లగా మారతుందట. ఇవే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఒత్తిడితో కూడిన లైఫ్, ఆనారోగ్య సమస్యలు, స్మోకింగ్ , పోషకాహార లోపం వంటి వివిధ కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయస్సు వారికి కూడా జుట్టు ఎందుకు తెల్లగా మారుతుందనే దానిపై అసలు విషయాన్ని తెలుసుకోవడాని Columbia University Irving Medical Center in New York సైంటిస్టులు పరిశోధన చేశారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. జుట్టు తెల్లగా మారడానికి అసలు కారణం ఒత్తిడేనని తేల్చి చెప్పారు. ఒత్తిడిని తగ్గించుకోవడం మొదలు పెడితే.. తెల్లగా ఉండే జుట్టు తిరిగి నల్లగా మారిందట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మానసికంగానే కాదు శారీరకంగా ఒత్తిడి ఉంటే కూడా జుట్టు రంగు మారుతుందని పరిశోధన తెలియజేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Egg Expiry Date : ఇక కోడిగుడ్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్.. అసలివి ఎన్నిరోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?