చుండ్రు, జుట్టు రాలడం ఎక్కువైందా? అయితే ఈ పెరుగు హెయిర్ ఫ్యాక్స్ ను ట్రై చేయండి..

By Mahesh RajamoniFirst Published Apr 26, 2023, 4:36 PM IST
Highlights

ప్రస్తుతం చాలా మంది చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పెరుగు ఈ సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

జుట్టు రాలడం, చుండ్రు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే చాలా మంది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఎన్నో రకాల మందులను, నూనెలను, షాంపూలను ఉపయోగిస్తుంటారు. చుండ్రును పూర్తిగా వదిలించుకోవడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీ జుట్టును శుభ్రంగా ఉంచాలి.  జుట్టుకు నూనె, మురికి లేకుండా చూసుకుంటే చుండ్రు తొలగిపోతుంది. అయితే పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్ లు కూడా చుండ్రుకు, జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. అవెలా తయారుచేయాలంటే? 

పెరుగు, తేనె

Latest Videos

పెరుగులో కొంచెం తేనె, కలబందను మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. 

పెరుగు, ఉప్పు

పుల్లని పెరుగులో కొద్దిగా ఉప్పును కలపండి. దీన్ని తలకు బాగా అప్లై చేయండి. గంట తర్వాత కడిగేయండి. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. 

పెరుగు, నిమ్మరసం

అరకప్పు పెరుగులో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఆ తర్వాత దీన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. దీనిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించండి. 

అయితే  జస్ట్ పెరుగును మాత్రమే తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో కడిగేయండి. ఈ హెయిర్ ప్యాక్ చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది. 

పెరుగు, గుడ్డు

ఒక కప్పు పెరుగు, ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, నెత్తిమీద అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో చల్లటి నీటితో కడిగేయండి.

మెంతులు, పెరుగు

ముందు రోజు నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. వీటితో పాటు గుప్పెడు మెంతులను తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒక కప్పు పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించండి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. చుండ్రును వదిలించుకోవడానికి ఇది గొప్ప ప్యాక్. 

click me!