Fathers Day: డాటర్స్‌ ఫస్ట్‌ లవ్‌..సన్స్‌ ఫస్ట్‌ సూపర్‌ హీరో.. ఫాదర్స్‌ డే..ఎప్పుడు ,ఎక్కడ,ఎలా మొదలైందంటే..!

Published : Jun 13, 2025, 03:19 PM IST
Minor son killed his father

సారాంశం

ఫాదర్స్ డే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేమతో జరుపుకుంటారు. ఈ రోజున బహుమతులకంటే తండ్రి ప్రేమను గుర్తించటం, ఆయన త్యాగాలకు కృతజ్ఞత చెప్పటం ముఖ్యమైనది.

బిడ్డలను నవ మోసాలు మోసి జన్మనిచ్చే తల్లిని మొదటి దైవంగా భావిస్తే..మనం భూమి మీదకు వచ్చినప్పటి నుంచి విద్య,బుద్దులు నేర్పి జీవితంలో స్థిరపడే వరకు మన వెన్నంటే ఉండే వ్యక్తి తండ్రి.తన బిడ్డలు సంఘంలో గౌరవంగా ఉండాలి అని రాత్రిబంవళ్లు ఆలోచించే వ్యక్తి నాన్న. అందుకే డాటర్స్‌ ఫస్ట్‌ లవ్‌..సన్స్‌ ఫస్ట్ సూపర్‌ హీరో తండ్రే అని తెలిసిన విషయమే.

చాలా మంది తండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడు మా అమ్మ పుట్టిందని, లక్ష్మీదేవి పుట్టిందని చెప్పుకుంటారు. కొడుకులు పుడితే..నా కుటుంబానికి నా తరువాత కొండంత అండ అని పొంగిపోతారు. తండ్రి మనసు సముద్రమంతా లోతు. అంతా తొందరగా నాన్న చేసే పనులను మనం అర్థం చేసుకోలేము.

ఆడపిల్ల వివాహం తరువాత తన భర్తలో తండ్రిని చూసుకుంటుంది. బిడ్డల జీవితంలో మూల స్తంభం అంటే నాన్నే. అలాంటి తండ్రులను గౌరవించడం కోసం ప్రత్యేకంగా జరుపుకునే రోజే ఫాదర్స్ డే.పాశ్చాత్య దేశాలలో దీని వేడుక ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ..ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతోంది.

ఈ ఏడాది ఫాదర్స్‌ డే...

ప్రతి సంవత్సరం జూన్‌ మూడవ ఆదివారం ఫాదర్స్‌ డే ని జరుపుకుంటారు.మే నెలలో మదర్స్‌ డే ని జరుపుకుంటే..తరువాతి నెల జూన్‌ లో ఫాదర్స్‌ డేని జరుపుకుంటాం. ఇప్పుడిప్పుడే ఇది భారత్‌ లో కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

అసలు ఎలా మొదలైంది..

1908లో, యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో 361 మంది పురుషులు మరణించారు. వారిలో ఎక్కువ మంది పిల్లలు కలవారే.దీంతో మొదట్లో ఆ రోజున వేడుకల్లా నిర్వహించేలేదు. ఆ తర్వాత 1910లో, సోనోరా స్మార్ట్ అనే మహిళ ఫాదర్స్ డేను జరపాలని నిర్ణయించుకుంది. సోనోరా స్మార్ట్ తండ్రులను కూడా మదర్స్ డే లాగా గౌరవించాలనుకుంది. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ సైన్యంలో సభ్యుడు. తన భార్య మరణించిన తర్వాత, అతను ఆరుగురు పిల్లలను ఒంటరి వ్యక్తిగా పెంచి పెంచాడు. సోనోరా తన పుట్టినరోజు అయిన జూన్ 5న ఫాదర్స్ డే జరుపుకోవాలని అనుకున్నాడు. కానీ కొన్ని సమస్యల కారణంగా, మొదటి ఫాదర్స్ డేను జూన్ 19, 1910న జరుపుకున్నారు. ఈ రోజున, తండ్రులకు బహుమతులు ఇవ్వడం కంటే, వారు కుటుంబం కోసం చేసిన త్యాగాలను, పిల్లలను పెంచడంలో వారు చూపిన అంకితభావాన్ని గుర్తించాలి

1972లో ఫాదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు దీనిని అమలులోకి తెచ్చారు. ఈ రోజున, తండ్రులకు బహుమతులు ఇవ్వడం ముఖ్యం కాదు. తన జీవితంలో ఎక్కువ భాగం తన కుటుంబ సంక్షేమానికి అంకితం చేసిన తండ్రి ప్రేమను అనుభూతి చెందాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు