ఇండియాలో ఇంత గొప్ప టూరిస్ట్, ట్రెక్కింగ్ ప్రదేశాలున్నాయా?

By Naga Surya Phani KumarFirst Published Sep 29, 2024, 2:14 PM IST
Highlights

డిజిటల్ ప్రపంచంలో రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారా? సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్ లేని ప్రశాంతమైన ప్రదేశాలకు మీరు వెళ్లాలనుకుంటే ఇక్కడ 3 అద్భుతమైన ప్రదేశాల గురించి వివరాలు ఉన్నాయి. ఇండియాలో ఈ ప్రాంతాలు చాలా ఫేమస్. అయితే ఇక్కడ  సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్ పెద్దగా ఉండవు. అందువల్ల మీరు నేచర్ అందాలు బాగా ఎంజాయ్ చేయగలరు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మనమందరం ఈ డిజిటల్ ప్రపంచంలో ఇరుక్కుపోయాం. వద్దనుకున్నా టెక్నాలజీని ఉపయోగించకుండా ఉండలేని పరిస్థితి. ఆఫీస్ ఫోన్లు, మీటింగ్ లు, మెయిల్స్, కాన్ఫరెన్స్ లు, మార్కెటింగ్ టూర్లు.. ఇలా ఇష్టమున్నా లేకున్నా టెక్నాలజీతోనే మనం జీవితం ముడి పడి ముందుకు సాగుతోంది. మీరు కూడా ఈ డిజిటల్ టెక్నాలజీ ప్రెషర్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? అసలు సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్ లేని కొన్ని ప్రదేశాలు ఇండియాలో ఉన్నాయి. అక్కడ కేవలం సహజంగా ఏర్పడిన నేచర్ మాత్రమే ఉంటుంది. గలగలపారే సెలయేర్లు, మంచు కొండలు, చుట్టూ పచ్చదనంతో నిండిన పర్వతాలు, ఇలా భారత దేశంలో వివిధ రకాల ప్రకృతి అందాలను మీరు ఆశ్వాదించొచ్చు.

Agumbe Rain Forest(దక్షిణ చిరపుంజి)

అగుంబే రెయిన్ ఫారెస్ట్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ జిల్లాలో ఉంది. అగుంబే అనేది ఒక చిన్న గ్రామం. ఇక్కడ వైవిధ్యమైన వాతావరణం ఉండటం వల్ల ఎప్పుడూ వర్షం పడుతుంది. దీన్ని దక్షిణ చిరపుంజి అని కూడా పిలుస్తారు. 
అగుంబే రెయిన్ ఫారెస్ట్ లో అనేక రకాల పక్షులు, సర్పాలు, జంతువులు, చెట్లు, వృక్ష జాతులు సమృద్ధిగా ఉంటాయి. ఇది భారీ వర్షాలకు నెలవుగా ఉంటుంది. 

Latest Videos

అగుంబే అడవిలో సాధారణంగా 7,000 - 8,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ King Cobraలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అరుదైన పక్షిజాతులు ఇక్కడ కనిపిస్తాయి. పులులు, హైనాలు, నక్కలు, ఏనుగులు వంటి పెద్ద జంతువుల జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. 

అగుంబే ఫారెస్ట్ ఎకో టూరిజం కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించేందుకు, వన్యప్రాణుల్ని పరిశీలించేందుకు ఎకో టూరిజం సంస్థ చాలా సౌకర్యాలు కల్పించింది. ఈ ప్రాంతంలో నిత్యం వర్షం కురిసే అడవులు, పర్వతాలు, నదులు, జలపాతాలు కనులవిందు చేస్తాయి. ముఖ్యంగా అగుంబే గ్రామం సమీపంలో ఉన్న జలపాతం వర్షపు కాలంలో చాలా సుందరంగా కనిపిస్తుంది. హైదరాబాద్‌ నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఈ ఫారెస్ట్ ఉంది. ఈ అడవిలో మొబైల్ నెట్వర్క్ ఉండదు. హాయిగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి స్వీట్ మెమొరీస్ ను ఈ ప్రాంతం అందిస్తుంది. 

Kheerganga Forest(ట్రెక్కింగ్ ప్రాంతం)

ఖీర్ గంగా వన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతి వాలీ లో ప్రసిద్ధ చెందిన అడవి. ఇది పర్యాటకంగా చాలా ఫేమస్. ఇక్కడ పార్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెక్కింగ్ చేసే వారు ఈ ప్రాంతాన్ని చాలా ఆస్వాదిస్తారు. అద్భుతమైన ప్రకృతి, పర్వతాలు, వృక్షాలు, ప్రాచీన హిమాలయ శైలిలో నిర్మించిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

ఖీర్ గంగా ప్రాంతంలో హిమాలయ శిఖరాలు, అద్భుతమైన అడవులు, జలపాతాలు, పర్వత దృశ్యాలు ఇక్కడ ప్రకృతి సంరక్షణ పద్ధతులు చాలా ప్రధానమైనవి. సందర్శకులు హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి యాక్టివిటీలను ఇక్కడ చేస్తారు. ట్రెక్ దూరం సుమారు 15 కి.మీ ఉంటుంది. ట్రెక్కర్స్ బాత్రా(Buntar) లేదా ఘోకు (Ghocha) నుంచి ప్రారంభమై ఖీర్ గంగా వద్ద పూర్తవుతుంది. ఇక్కడ క్షీర గంగ శివాలయం ఒక పురాతనది. 
ఇక్కడ నీరు ఉప్పగా ఉంటుంది. వంటలు కూడా  చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఖీర్ గంగా ప్రాంతం ప్రశాంతతకు నిలయం. హిమాలయ పర్వతాలు కూడా ఉండటంతో పర్యాటకులు ప్రత్యేక అనుభూతిని పొందుతారు. జనవరి టైమ్ లో జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి. 
ఈ ప్రాంతంలో వెళ్ళేందుకు ఉత్తమమైన సమయం మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. అయితే, వర్షాకాలంలో ట్రెక్కింగ్ సులభంగా చేయడానికి అనుకూలంగా ఉండదు. ఈ ప్రాంతంలో పర్యటించడానికి మార్చి, డిసెంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి. 

Zanskar Snow Clad(మంచు ప్రాంతం) 

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రాంతం జాంస్‌కర్. ఇక్కడ మంచుతో నిండిన పర్వతాలు, అడవులు, చల్లని వాతావరణం పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. జాంస్‌కర్ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. 
ఇది లేహ్ నుండి దాదాపు 105 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మంచు శిఖరాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ జాంస్‌కర్ నదితో పాటు పంగాంగ్, సురుక్ వంటి అద్భుతమైన జలాశయాలు ఉన్నాయి.

జాంస్‌కర్ నది హిమాలయాల్లో పుట్టి కాశ్మీర్ లోకి ప్రవహిస్తుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతం అంతా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ ఊద్ధర్ గాలి అనే ప్రత్యేకమైన ప్రాంతం చాలా ప్రత్యేకమైంది. ఇది చూడటానికే పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. జాంస్‌కర్ లో ట్రెక్కింగ్ చాలా ఫేమస్. ఈ వాతావరణం టెక్కింగ్ కు చాలా అనుకూలమైంది. మీరు ప్రశాంతమైన ప్రకృతిని, మంచును, పర్వతాలను దగ్గరగా చూడాలనుకుంటే ఈ ప్రాంతాన్ని సందర్శించాలి. జాంస్‌కర్ లోని బౌద్ధ మఠాలు, గుహలు, పురాతన ఆలయాలు అక్కడి చరిత్రను తెలియజేస్తాయి. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి జులై నుండి సెప్టెంబర్ వరకు బాగుంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఆ టైమ్ లోనూ రావడానికి అనుకూలంగా ఉంటుంది. 

ఇలాంటిివి భారత దేశంలో మరిన్ని ప్రాంతాలున్నాయి. ఈ ఉరకల పరుగుల జీవితంలో కాస్త టైమ్ తీసుకొని వాటిని కూడా సందర్శించి రిలాక్స్ అవ్వండి.

click me!